Trending today: RRRలో ఎన్టీఆర్, చరణ్ ఎలా కొట్టుకున్నారో.. ఈ వీడియోలో రైనో, ఏనుగు అలా కొట్టుకున్నాయి...
Viral Video today: ఈ మధ్య యానిమల్స్ కు సంబంధించిన ఏ వీడియో అయినా సరే సోషల్ మీడియాలో ఇట్టే వైరల్ అవుతోంది. తాజాగా ఏనుగు, రైనోకు సంబంధించిన ఫైట్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.
Elephant and rhino fight video viral: సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా జంతువులకు సంబంధించిన వీడియోలు క్షణాల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. ఎక్కువగా పాములు, ఏనుగులు, సింహాలు, పులుల వంటి వీడియోలను ప్రజలు అధికంగా చూస్తున్నారు. తాజాగా ఏనుగు మరియు ఖడ్గమృగం మధ్య జరిగిన ఫైట్ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా విపరీతంగా వైరల్ అవుతోంది.
వీడియో ఓపెన్ చేస్తే..ఒక నాడు రాత్రి సమయంలో ఏనుగు, ఖడ్గమృగం ఎదురుపడతాయి. అయితే ఏనుగు పోలిస్తే రైనో కాస్త చిన్నదిగానే ఉందని చెప్పాలి. ఈ క్రమంలో రెండు ఒకదానికొకటి కోపంగా చూసుకుంటూ ఉంటాయి. అయితే ముందుగా ఖడ్గమృగం ఏనుగుపైకి దూసుకెళ్తుంది. దీంతో ఎలిఫెంట్ఎదురుదాడికి దిగుతుంది. దీంతో కాస్త తగ్గుతుంది ఖడ్గమృగం. ఏనుగు పైపైకి వస్తుండటంతో..రైనో మళ్లీ ఎటాక్ చేస్తోంది. దీంతో ఎలిఫెంట్ ఒక దెబ్బకు కింద పడేసి తొక్కుతుంది. దీంతో దెబ్బలు తిన్న ఖడ్గమృగం కుంటుకుంటూ అక్కడి నుంచి పరుగులు తీసింది.
Also Read: Python Video: ఎవడ్రా బుడ్డోడు.. ధైర్యానికి బ్రాండ్ అంబాసిడర్‌లా ఉన్నాడు.. భారీ కొండచిలువపై సవారీ
ఈ వీడియోను 'క్లాష్ ఆఫ్ ది టైటాన్స్' అనే పేరుతో ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి సుశాంత నందా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అప్ లోడ్ చేయబడిన కొన్ని గంటల్లోనే వీడియోను వేల మంది చూశారు. అంతేకాకుండా వందల మంది లైక్ చేశారు. అంతేకాకుండా దీనిపై నెటిజన్స్ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
Also Read:Christmas Santa Claus: ఆకాశంలో క్రిస్మస్‌కి ముందే క్రిస్మస్ చెట్టు..ఈ అద్భుతాన్ని మీరు చూశారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter