Christmas Santa Claus: ఆకాశంలో నక్షత్రాల గుంపు మనకు ప్రతిరోజు కనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి నక్షత్రాల గుంపును NASA ఫొటోస్ తీసి షేర్ చేసింది ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఈ నక్షత్రాల గుంపు అచ్చం చూడడానికి క్రిస్మస్ చెట్టులా కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ ఫొటోస్ తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా ఈ ఫోటోను దాదాపు 2500 కాంతి సంవత్సరాల దూరం నుంచి తీసినట్లు తెలిపింది. ఈ నక్షత్రాల గుంపు అచ్చం క్రిస్మస్ చెట్టును పోలి ఉంటుంది. ఆకాశంలో కొన్ని నక్షత్రాలు చిన్నవిగా మరికొన్ని నక్షత్రాలు పెద్దవిగా కనిపిస్తూ ఉంటాయి. దీని కారణంగానే నక్షత్రాల గుంపు చెట్టు ఆకారంలా కనిపిస్తున్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
చాలా రకాల కో టెలిస్కోపుల నుంచి తీసిన ఫోటోలను కలపడం వల్ల ఈ క్రిస్మస్ చెట్టు ఫోటో రూపొందిందని నాసా పరిశోధకులు చెబుతున్నారు. నాసా ఈ ఫోటోలో ఉన్న ఆకుపచ్చని రంగు బ్యాగ్రౌండ్ను నుబుల(nebula)ను WIYN 0.9m టెలిస్కోప్ ద్వారా తీసినట్లు పేర్కొంది. అలాగే తెలుగు వర్ణం కూడిన నక్షత్రాలు మైక్రోన్ ఆల్ స్కై సర్వే అనే సర్వే నుంచి.. పిక్ అచ్చం క్రిస్మస్ చెట్టులా కనిపించేందుకు క్లాస్ వైస్ లో దాదాపు 160 డిగ్రీలు తిప్పారని నాసా తెలిపింది.
It's beginning to look a lot like cosmos. 🎶
Our @ChandraXray Observatory recently spotted the blue-and-white lights that decorate the "Christmas Tree Cluster," a swarm of stars and gas some 2,500 light-years from Earth: https://t.co/VT2WaLgp77 pic.twitter.com/HrnrmxRyd7
— NASA (@NASA) December 19, 2023
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
ఈ నక్షత్రాలలో ఎక్కువగా యువ నక్షత్రాలు ఉన్నట్లు నాసా గుర్తించింది వీటి వయస్సు దాదాపు 10 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉంటుందని తెలిపింది. అంతేకాకుండా ఈ నక్షత్ర గుంపుకు దాదాపు బిలియన్ల సంవత్సరాల వయస్సు ఉంటుందని పేర్కొంది.
నక్షత్రాలతో పోలిస్తే సుదీర్ఘ జీవితకాలంతో ఉన్నాయి. కానీ క్రిస్మస్ ట్రీ క్లస్టర్ నక్షత్రాలను మన కళ్ళతో మాత్రం చూడలేము. ప్రస్తుతం నాసా షేర్ చేసిన క్రిస్మస్ చెట్టు ఫొటోస్ అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. షేర్ చేసిన ఫోటోల్లో బ్లూ, వైట్ కలర్స్ లో ఉండే నక్షత్రాలను మనం చూడవచ్చు. కొన్ని కొన్ని సార్లు వాయువు కొన్ని ధూళి మేఘాలు ఆకాశంలో ఆకుపచ్చని రంగును విడుదల చేస్తాయి. ఈ ఫోటోలో నెబ్యులా( Nebula ) ఆకారం అచ్చం చెట్టుకొమ్మలను పోలి వుంటుంది. అంతేకాకుండా నక్షత్రాలు మెరిసే ఆభరణాలలాగా కనిపిస్తాయి.
Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebook, Twitter