Drunken Drive Test Viral Video: డ్రంకెన్ డ్రైవ్‌లో అప్పుడప్పుడు మందు బాబులు ప్రవర్తించే తీరు నవ్వు తెప్పిస్తుంటుంది. మద్యం తాగి దొరికిన వారు చిత్ర విచిత్ర సమాధానాలతో చెబుతుంటారు. ఇలాంటి వీడియోలు మనం గతంలో చాలా చూశాం. తాజాగా మరో నవ్వు తెప్పించే వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మందు తాగి డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికిపోయిన ఓ వ్యక్తి.. తాను పాలు తాగానంటూ బుకాయించాడు. మేడ్చల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాలు ఇలా..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేడ్చల్-కండ్లకోయలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో అల్వాల్ ప్రాంతానికి చెందిన కరుణాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మద్యం సేవించి వాహనం నడుపుకుంటూ వచ్చాడు. పోలీసులు టెస్ట్ చేయగా.. మద్య సేవించినట్లు తేలింది. మిషన్‌లో సౌండ్ రాగా.. కరుణాకర్ 94 వచ్చిందా సార్ అని అడిగాడు. ఏం తీసుకున్నారు..? అని ట్రాఫిక్ పోలీసు ప్రశ్నించగా.. ఇప్పుడే పాలు తాగి వచ్చాను సార్ అని సమాధానం ఇచ్చాడు. దీంతో పక్కన ఉన్న పోలీసులు ఒక్కసారిగా పగలబడి నవ్వారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 


 



ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. "బిడ్డ అంత కాన్ఫిడెన్సుతో క్లారిటీగా చెబుతుంటే.. నమ్మరా.. అధ్యక్షా..? ఇంత దారుణమైన, కఠిన హృదయాలేంటయ్యా  మీవి..?పసిబిడ్డ పాలు తాగానని చెబుతున్నాడు కదా..? నమ్మరేంటి..? తను తాగిన పాలలో మద్యం కలిపి కల్తీ చేసినోడిని పట్టుకోకుండా, కల్తీకి బలైన బాధితుడిని, అదీ పాలు తాగే పసిబిడ్డను పట్టుకుంటారా..? న్యాయమేనా మీకు..? ఆయ్" అంటూ ఓ నెటిజన్ సెటైరికల్ కామెంట్ పెట్టాడు. 'నేను పాలే తాగాను పింకీ.. ఎధవలు అందులో విస్కీ కలిపేశారు..' అంటూ మరో నెటిజన అన్నాడు. 


Also Read: Team India: బుమ్రా, శ్రేయాస్ అయ్యర్ రీఎంట్రీకి రెడీ.. ఆ బౌలర్ మాత్రం ఎప్పుడంటే..!   


Also Read: Tomato Price Today: ఐదు టమటాలు ఎత్తుకెళ్లిన మహిళ.. పోలీసులు ఏం చేశారంటే..!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి