Viral Video: సోషల్ మీడియాలో ఇటీవల ఫేమస్ అయ్యేందుకు యువత తమ టాలెంట్‌కు పదునుపెడుతున్నారు. వింత వింత ఆలోచనలతో వీడియోలు చేస్తూ.. నెటిజన్లకు మెంటలెక్కిస్తున్నారు. వెహికల్స్‌పై రకరకాల స్టంట్స్‌ చేస్తూ.. అసాధారణమైన ప్రయోగాలతో కొంతమంది ఆకట్టుకుంటున్నారు. తాజా అలాంటి ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. బైక్‌కు ట్రాక్టర్ టైర్‌ సెట్ డ్రైవ్ చేయడం అందరికీ ఆకర్షిస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌ను ఊపేస్తోంది.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

@mrhifixyz అనే వినియోగదారు పోస్ట్ చేసిన వీడియోలో.. ఓ యువకుడు బజాజ్ పల్సర్‌ను నడుపుతున్నాడు. కానీ ఇది మీ సాధారణ బైక్ కాదు. బైక్ ఫ్రంట్ వీల్‌ను తీసేసి.. దానికి ముందు ట్రాక్టర్ పెద్ద టైర్‌ను సెట్ చేశాడు. ఈ విచిత్రమైన డ్రైవింగ్ నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇప్పటికే వరకు ఈ వీడియోపై 232,000 లైక్‌లు వచ్చాయి. పడలబడి నవ్వుకుంటూ.. ఫన్నీ కామెంట్స్‌తో రెచ్చిపోతున్నారు. "వావ్! భారతీయ ఆవిష్కరణకు నిజంగా ఒక ఉదాహరణ' అంటున్నారు. టాలెంట్‌కు హద్దుల్లేవని నిరూపించాడని పొగుడుతున్నారు.


మరికొందరు హెచ్చరికలు కూడా ఇచ్చారు. ఆ యువకుడికి కొన్ని సలహాలు కూడా ఇచ్చారు. ఇది సూపర్ టాలెంట్ కావొచ్చు.. కానీ రద్దీ ఉన్న ప్రదేశాలలోకి వెళితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది.. జాగ్రత్త అని చెబుతున్నారు. బహిరంగా ప్రదేశాలలో ఇలాంటి సాహసకృత్యాలను చేయకపోవడం ఉత్తమని హితవు పలుకుతున్నారు. "ఇండియన్ ఘోస్ట్ రైడర్" అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే బైక్‌ను నడుపుతున్నప్పుడు చుట్టు పక్కల రద్దీ ఏమీ లేదు. ఎంతో కూల్‌గా బైక్‌ను నడిపాడు. బైక్‌ను మరీ అంత వేగంగా నడిపేందుకు వీలు కుదరలేదు. మధ్య మధ్యలో కాల్ కిందపెడుతూ.. స్లోగా బైక్‌ను నడిపాడు. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి. \


 




 


ఇది కూడా చదవండి: IND vs BAN World Cup 2023: రేపే బంగ్లాదేశ్‌తో భారత్ పోరు.. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగిస్తుందా..? పిచ్ రిపోర్ట్ ఇలా..!  


ఇది కూడా చదవండి: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్.. ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న బన్నీ..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook