Viral Video today: సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా ఇట్టే వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా జంతువులు వీడియోలు ట్రెండింగ్ లో ఉంటున్నాయి. తాజాగా ఓ ఏనుగు మనుషులను ఛేజ్ చేసింది. తాను వెంటబడితే ఎలా ఉంటుందో మనుషులకు చూపించింది. ఈ వీడియో(Viral Video)  చూస్తే మీ వెన్నులో వణుకు పుట్టడం ఖాయం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. ఊటికి వెళ్తున్న ఓ ఫ్యామిలీకి దారి మధ్యలో ముతంగ అనే ఏరియా వద్ద ఏనుగు కనబడుతోంది. దాంతో ఆ గజరాజును ఫోటోలు తీసేందుకు కారులో నుండి ఇద్దరు వ్యక్తులు కిందకు దిగుతారు. అయితే అది వారిపై దాడి చేస్తుందని ఊహించి ఉండరు. ఒక్కసారి ఏనుగు ఆ ఇద్దరిని వెంబడిస్తుంది. వారు హడలిపోయి భయంతో పరుగులు తీస్తారు. ఏనుగు కూడా అంతే వేగంతో వారి వెనుక పరుగెడుతోంది. ఈ క్రమంలో ఓ వ్యక్తి కింద పడిపోతాడు. దాంతో వెంటనే ఏనుగు అతడిని కాళ్లతో తొక్కేందుకు ప్రయత్నించి వదిలిస్తోంది. ఏనుగు సీరియస్ గా తీసుకోలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే అతడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. అనంతరం ఏనుగు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో సదరు వ్యక్తి ఊపిరి పీల్చుకున్నాడు. 


Also Read: Snakes: ఈ చెట్లంటే పాములు పడిచస్తాయంట.. ఇవి ఇంట్లో ఉంటే పాములకు గ్రీన్ కార్పెట్ వేసినట్లే..


ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది.  ఈ వీడియో wayanadgram అనే ఇన్ స్టా పేజీలో షేర్ చేయబడింది. ఇప్పటికే వేల సంఖ్యలో లైక్స్ వచ్చాయి. అంతేకాకుండా ఈ వీడియోపై నెటిజన్లు తమదైన కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు ఫారెస్ట్ లో ప్రయాణించేటప్పుడు కారులో నుంచి ఎందుకు దిగడమని ఒకరు కామెంట్ చేస్తే.. అదే ఏనుగు సీరియస్ గా తీసుకుని ఉంటే కథ వేరేలా ఉండేదని మరికొరు కామెంట్ చేశారు. నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్న ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి. 



Also Read: King Cobra on Fan: ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఇంట్లో ఫ్యాన్‌పై తిరుగుతూ కింగ్‌ కోబ్రా హల్‌చల్‌



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook