Couple Romance On Moving Car video viral : ప్రేమ గురించి మన సినిమాల్లో ఎంతో గొప్పగా చూపించారు దర్శకులు. ఓ లైలా మజ్ను, దేవదాసు పార్వతీ, సలీం-అనార్కలి వంటి మహానీయమైన సినీ కావ్యాలు మనకు అందించారు. అలాంటి ప్రేమికులు మన సమాజంలో నూటికో కోటికో కనబడుతుంటారు. ఈరోజుల్లో ప్రేమ అనేది టైం పాస్ అయిపోయింది. లవ్ పేరుతో పిచ్చి పిచ్చి వేషాలు వేసేవారే కొందరు అయితే.. ప్రేమ మరి ఎక్కువై తిక్క పనులు చేసేవారు మరికొందరు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియా వచ్చాక ప్రతి ఒక్కరూ ఆన్ లైన్ లో ప్రపోజ్ చేసేసుకుంటున్నారు. ఒక అమ్మాయి రిజక్ట్ చేస్తే.. వెంటనే మరొక అమ్మాయికి లవ్ ప్రపోజల్ పెట్టేస్తున్నారు. రోజూ చాటింగ్స్, మీటింగ్స్, డేటింగ్స్ అంటూ ప్రేమకు రకరకాల పేర్లు పెట్టి ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటారు. ఈ మధ్య ప్రేమను తమకు ఇష్టమైన వారికి చెప్పడానికి కొంచెం డిఫరెంట్ గా ఆలోచిస్తున్నారు ప్రేమికులు. లాంగ్ డ్రైవ్‌కి తీసుకెళ్లి ప్రపోజ్ చేయడం, రకరకాల గిప్ట్స్ ఇచ్చి ప్రేమను వ్యక్తపరచడం లాంటివి చేస్తున్నారు. కొంత మందికి ప్రేమ ఫీక్స్ లో ఉంటుంది. వీరు ఏం చేస్తారనేది ఎవరూ ఊహించలేరు. తాజాగా అలాంటి ప్రేమ పైత్యం ఎక్కువైన ఓ జంట వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 


Also Read: Viral Video: స్టేజ్ మీద కొడుకు యాక్టింగ్.. కింద తండ్రి ఆనంద భాష్పాలు.. నెటిజన్లను కదిలిస్తున్న వీడియో..


వీడియో ఓపెన్ చేస్తే.. ఫార్చ్యూనర్ కారు రోడ్డుపై వెళ్తూ ఉంటుంది. దానికి ఓ అమ్మాయి వేళాడుతూ కనిపించింది. ఆమె కారుకు ఉండే బంపర్ సపోర్ట్‌పై నిలబడి ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి ఆమెను ఒక చేత్తో పట్టుకుని ఉంటాడు. ఇద్దరు ఏం చేస్తున్నారనేది క్లారిటీ లేదు. వీడియోను బాగా పరిశీలిస్తే ఆ అమ్మాయి కారు నడుపుతున్న వ్యక్తితో ఏదో కబుర్లు చెబుతున్నట్లు మాత్రం అర్థమవుతోంది. ఈ మెుత్తం సీన్ ను వెనకున్న వేరే కారు నుంచి షూట్ చేశారు. ఈ ఘటన లక్నోలోని ఫీనిక్స్ ప్లాసియో సమీపంలో జరిగినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా విపరీతంగా వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్స్ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ జంటకు పోలీసులు తగిన గుణపాఠం చెప్పాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. టికెట్ కొనకుండానే ఫ్రీగా రోడ్డుపై సినిమా చూపించారని ఓ యూజర్ కామెంట్ చేశాడు. ఈ ఘటనపై పోలీసుల కేసు నమోదు చేసినట్లుగా తెలుస్తోంది. 



Also Read: Matric Exam Paper Viral: ప్లీజ్ సార్.. నన్ను పాస్ చేయండి.. లేకుంటే పెళ్లి చేస్తారు.. యువతి ఎగ్జామ్ పేపర్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter