Viral Video today: సాధారణంగా జింకలను శాకాహారులుగా భావిస్తాం. ఎందుకంటే ఇవీ ఎక్కువగా అడవుల్లో దొరికే గడ్డి, దుంపలు, ఆకులను మాత్రమే తింటాయి. తాజాగా ఓ జింక పామును నమిలి తిన్న వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇప్పుడు అందరిలోనూ సరికొత్త ప్రశ్న ఉత్పన్నమైంది. జింక శాఖహారా.. మాంసాహారా అని!.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సాధు జంతువైన జింక మాంసాహారాన్ని తీసుకోవడం నెటిజన్లను షాక్ కు గురిచేస్తోంది. నమ్మడానికి కష్టంగా ఉన్నా.. ఇది మాత్రం నిజం. దీనికి సంబంధించిన వీడియోను ఇండియన్ ఫారెస్ట్ అధికారి సుశాంత్ నందా ట్విటర్ లో షేర్ చేశారు. దీనికి ''ప్రకృతిని బాగా అర్థం చేసుకోవడానికి కెమెరాలు ఉపయోగపడుతున్నాయి. శాకాహారులైన జంతువులు ఒక్కోసారి పాములను కూడా తింటాయి''’ అనే క్యాప్షన్ కూడా ఇచ్చారు. 



వీడియో ఓపెన్ చేస్తే... ఓ వ్యక్తి కారులో వెళ్తుంటాడు. రోడ్డు పక్కన నిలబడి పామును తింటున్న జింకను చూస్తాడు. వీడియో రికార్డు చేస్తున్న వ్యక్తి బ్యాక్‌గ్రౌండ్‌లో "జింక పామును తింటుందా?" అనడం వినిపిస్తుంది. ఇందులో జింక పామును నోటితో కసబిసా నిమిలి మింగడం చూడవచ్చు. అయితే ఈ వీడియో చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.  జింక గడ్డి అనుకుని పామును నమిలేస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను సైన్స్ గర్ల్ అనే పేజీ కూడా షేర్ చేసింది. ముఖ్యంగా శీతాకాలంలో మెుక్కలు జీవితం కాలం తక్కువగా ఉంటుందని.. దాని కారణంగానే జింకలు మాంసహారం వైపు మెుగ్గుచూపే అవకాశం ఉందని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. 


Also Read: Goose Bumps Video: మొండి నరికిన కింగ్ కోబ్రా తనను తాను ఎలా కాటేసుకుందో మీరే చూడండి..పక్క గూస్ బంప్స్ వీడియో!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook