Viral video: కేదార్‌నాథ్ ఆలయ సమీపంలో భారీ హిమపాతం.. వైరల్ అవుతున్న వీడియో..
Kedarnath Temple: భారీ హిమపాతం కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలను తాకింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదు.
Massive avalanche hits mountains around Kedarnath Temple: ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయం చుట్టూ ఉన్న పర్వతాలపై గురువారం భారీ హిమపాతం సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ఆస్తి లేదా ప్రాణనష్టం జరగలేదు. తాజాగా దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. వీడియోలో పర్వతాలను భారీ మంచు కమ్మేయడం చూడవచ్చు. ఈ దృశ్యాన్ని కేదార్‌నాథ్ ఆలయానికి వెళ్లిన భక్తులు తిలకించడాన్ని మీరు గమనించవచ్చు.
జూన్ 4న రాష్ట్రంలో ఇలాంటి మంచు హిమపాతమే సంభవించి.. హేమకుండ్ సాహిబ్‌కు వెళ్లే యాత్రికుల బృందాన్ని తాకింది. వారిలో ఐదుగురిని స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ (SDRF) బృందం రక్షించింది. అయితే రెస్క్యూ ఆపరేషన్ తిరిగి ప్రారంభించిన తర్వాత జూన్ 5న ఒక యాత్రికుడి మృతదేహాన్ని కనుగొంది.
మరోవైపు, కేదార్‌నాథ్ ధామ్ యాత్రకు సంబంధించిన ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 10 వరకు మరియు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ జూన్ 15 వరకు నిలిపివేయబడింది. ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న భక్తులు ధామ్‌ను దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు 41 లక్షల మంది భక్తులు చార్ధామ్ యాత్రకు రిజిస్టర్ చేసుకున్నారని పర్యాటక శాఖ తెలిపింది. రద్దీని నియంత్రించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పర్యాటక శాఖ నివేదిక ప్రకారం, వాతావరణం అనుకూలంగా ఉన్నప్పుడు కేదార్‌నాథ్, బద్రీనాథ్, గంగోత్రి మరియు యమునోత్రి ధామ్‌లను రోజుకు 60 వేల మందికి పైగా యాత్రికులు సందర్శిస్తున్నారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్ మరియు బద్రీనాథ్ లను చార్ ధామ్ గా పేర్కొంటారు. భక్తుల దర్శనార్థం గంగోత్రి మరియు యమునోత్రి యొక్క గుడి తలుపులు ఏప్రిల్ 22, అక్షయ తృతీయ నాడు తెరిచారు. కేదార్‌నాథ్ ధామ్ యొక్క తలుపులు ఏప్రిల్ 25న మరియు బద్రీనాథ్ ధామ్ ఏప్రిల్ 27న తెరవబడ్డాయి.
Also Read: Rs 2,000 Notes: రూ. 2 వేల నోట్లు ఎన్ని లక్షల కోట్లు వెనక్కి వచ్చాయంటే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook