Peacock Flying Video: మనదేశ జాతీయ పక్షి నెమలి అని అందరికీ తెలిసిన విషయమే. మయూర అందం వర్ణనాతీతం. నెమలిని (Peacock) పక్షుల రాజు అని కూడా అంటారు.  ఇవి ముఖ్యంగా భారతదేశం, ఆగ్నేయాసియా, ఆఫ్రికా ఖండంలోని కాంగో బేసిన్‌లో కనిపిస్తాయి. నెమళ్లు పురివిప్పి ఆడితే చూడటానికి రెండు కళ్లు చాలవు. నెమలి డ్యాన్స్ చేస్తే అంత అందంగా ఉంటుంది మరి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

భూమిపై ఎగిరే పక్షులలో నెమళ్లు కూడా ఒకటి. నెమలి ఎగురుతూ కన్పించడం అనేది అరుదుగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే ఇతర పక్షులతో పోలిస్తే వాటి శరీరం బరువు ఎక్కువగా ఉండటమే కారణం. అందుకే అవి ఎక్కువ దూరం ఎగరవు. తాజాగా నెమలి ఎగురుతున్న వీడియో (Peacock Flying Video) నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మీరు ఈ వీడియోపై ఓ లుక్కేయండి మరి. 



వీడియో ఓపెన్  చేస్తే.. ఓ అడవిలో రెండు నెమళ్లు నడుస్తూ ఉంటాయి. ఇందులో ఒక మయూరం నెమ్మదిగా గాల్లో ఎగురుతూ ఉంటుంది. ఈ దృశ్యాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ వీడియోని 'మెజెస్టిక్ ఫ్లైట్' అనే క్యాప్షన్‌తో  @CosmicGaiaX అనే సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో షేర్ చేసింది. కేవలం 10 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోకి ఇప్పటి వరకు 2.5 మిలియన్ల వీక్షణలు, 27.5k లైక్‌లు వచ్చాయి. 


Also Read: Man Sleeping on Moving Car: రన్నింగ్‌ కారుపై నిద్రపోతున్న వ్యక్తి.. వీడియో వైరల్ 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి