Viral Video today: సాధారణంగా కొద్ది మందిలో మాత్రమే మల్టీటాలెంటెడ్ స్కిల్స్ ఉంటాయి. అంటే వీరు మూడు, నాలుగు రకాల వాటిలో నైపుణ్యాలను కలిగి ఉంటారు. సౌతాఫ్రికా క్రికెటర్ ఏబీ డీవిలియర్స్ చూసుకుంటే అతడు తన కెరీర్ లో క్రికెట్ మాత్రమే కాదు చాలా గేమ్స్ లో దేశానికి ఆడాడు. అలాగే మన దేశ ప్రధాని పీవీ నరసింహరావు ఆనర్గళంగా 10 నుంచి 15 భాషలు మాట్లాడుతారు. స్టార్ నటులైన యంగ్ టైగర్ ఎన్టీఆర్, నేషనల్ క్రష్ రష్మిక సైతం 6-7 భాషలు మాట్లాడుతారు. దానికి కారణం వారి సాధన. అయితే తాజాగా ఓ నాలుగేళ్ల బాలిక ఏడు భాషలు మాట్లాడేస్తోంది. తాజాగా ఈ చిన్నారికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రకంపనలు సృష్టిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వీడియో ఓపెన్ చేస్తే.. లిటిల్ బిగ్ షాట్స్ అనే టీవీ షోలో బెల్లా అనే చిన్నారిని పాల్గొంది. ఆ బుడ్డదాన్ని ''నీకు ఎన్ని భాషలు తెలుసు'' అని హోస్ట్ అడగ్గా... నాకు ఏడు లాంగ్వేజెస్ తెలుసని చిన్నారి బదులిచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏయే భాషలు మాట్లాడతావు? అని వ్యాఖ్యత ప్రశ్నించగా.. తాను రష్యన్, ఇంగ్లీష్, అరబిక్, ఇటాలియన్, స్పానిష్, జర్మన్, ఛైనీస్ ఆనర్గళంగా మాట్లాడతానని ఆ బుడ్డది సమాధానం చెప్పింది. ఆ చిన్నారి అన్ని భాషలను ఒక్కొక్కటిగా ఎలా మాట్లాడుతుందో మీరు వీడియోలు చూడవచ్చు. ఈ చిన్నారి ప్రతిభకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. ఆ వీడియోను లైక్ చేయడంతోపాటు తమదైన శైలిలో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు నెటిజన్స్. దీంతో ఈ చిన్నారి ఒక్కసారిగా సోషల్ మీడియాలో సెలెబ్రిటీగా మారిపోయింది. 



Also Read: Tiger viral video: ఇదేం పులి రా బాబు.. దాడి చేయడానికి వచ్చి హాయిగా గోడపై నిద్రపోయింది..


Also Read: Trending Video: కోర్టులోకి దూసుకొచ్చిన అడవి ఏనుగు.. భయభ్రాంతులకు గురైన లాయర్లు.. వైరల్ అవుతున్న వీడియో..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook