Google Search: భారతీయులు అత్యధికంగా వెతికిన పదాలు, వివరాలు ఏంటో తెలుసా
Google Search: గూగుల్. నిత్య జీవితంలో ఏ చిన్న అవసరం వచ్చినా వెంటనే గుర్తొచ్చేది అదే. ప్రతి సందేహానికి సమాధానం అణ్వేషించేది గూగుల్లోనే. అటు గూగుల్ కూడా ఎవరు ఎక్కువగా దేని గురించి సెర్చ్ చేశారనే వివరాలు నమోదు చేస్తుంటుంది.
గూగుల్ ప్రతియేటా ఏ దేశంలో ఎవరు దేని గురించి అణ్వేషించారనే డేటా విడుదల చేస్తుంటుంది. ఇప్పుడు 2022 ఏడాది ముగుస్తున్న నేపధ్యంలో ఈ ఏడాది అంటే 2022లో ఎక్కువగా సెర్చ్ చేసిన పదాల జాబితాను గూగుల్ ఇయర్ సెర్చ్ 2022 పేరుతో విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం భారతీయులు అత్యధికంగా దేనికోసం వెతికారనేది పరిశీలిద్దాం.
ఈ ఏడాది గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో భారతీయులు ఎక్కువగా వెతికిన పదం క్రికెట్. క్రికెట్ గురించి అన్నింటికంటే ఎక్కువగా అణ్వేషించారు. ఇందులో భాగంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఆసియా కప్, ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2022 ఈ మూడు పదాల కోసం భారతీయలు చాలా ఎక్కువగా అణ్వేషించారు. అదే సమయంలో ఈ ఏడాది తొలి ఆరునెలల కాలంలో కోవిన్ యాప్ గురించి కూడా వెతికారని గూగుల్ జాబితా వెల్లడించింది.
గూగుల్ టాప్ 5 సెర్చ్ వర్డ్స్ జాబితాలో ప్రస్తుతం ఖతర్ లో జరుగుతున్న ఫిఫా వరల్డ్ కప్ పదం ఉంది. ఈ పదం ఈ ఏడాది పూర్తయ్యేసరికి టాప్ 3లో చేరుకోవచ్చు. అదే సమయంలో భారతీయులు ఎక్కువగా అణ్వేషించిన వాటిలో కామన్ వెల్త్ గేమ్స్, ఐపీఎల్ స్పోర్ట్స్ పదాలున్నాయి. అదే సమయంలో బ్రహ్మాస్త్ర, పార్ట్ 1 శివ, కేజీఎఫ్ ఛాప్టర్ 2, ఇ శ్రమ్ కార్డ్ గురించి ఎక్కువగా అణ్వేషణ సాగింది.
ఇక What is జాబితాలో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి వివాదాస్పదంగా మారిన అగ్నిపథ్ స్కీమ్ ఉంది. What is అని టైప్ చేసిన పదాల్లో నాటో, ఎన్ఎఫ్‌టి, పీఎఫ్ఐ, సరోగసీ, సోలార్ ఎక్‌లిప్స్, ఆర్టికల్ 370 పదాలున్నాయి. సమీపంలో ఉన్న కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్, స్విమ్మింగ్ ఫూల్, వాటర్ పార్క్, మాల్స్ గురించి నెటిజన్లు అణ్వేషించారు.
ఇండియన్స్ ఎక్కువగా దేని గురించి వెతికారు
హౌ టు డౌన్‌లోడ్ కోవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్, పీటీఆర్‌సీ చలాన్, హౌ టు మేక్ ఇ శ్రమ్ కార్డ్ , హౌ టు లింక్ వోటర్ ఐడీ కార్డ్ విత్ ఆధార్ కార్డు వంటి విషయాలున్నాయి. ఇక గూగుల్ సెర్చ్‌లో వెతికిన ప్రముఖ వ్యక్తుల్లో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, యూకే కొత్త ప్రదాని రిషి సునాక్, బీజీపే నేత నూపుర్ శర్మ, లలిత్ మోదీ, ఏక్‌నాథ్ షిండే, లతా మంగేష్కర్, సిద్దూ మూసేవాలా, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం , యూపీ ఎన్నికల ఫలితాలు, దేశంలోని కోవిడ్ 19 కేసులు, షేన్‌వార్న్ మృతి, క్వీన్ ఎలిజబెత్ 11 మరణం, బప్పి లహరి మరణం ఉన్నాయి.
Also read: Zombies Viral Video: అమెరికా రోడ్లపై హల్చల్.. పగటిపూట స్వేచ్చగా తిరుగుతున్న జాంబీలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook