154 Year Old Monk Found: దేశవ్యాప్తంగా ఇప్పుడు మహా కుంభమేళాపైనే చర్చ జరుగుతోంది. మౌని అమావాస్యను పురస్కరించుకుని దాదాపు పది కోట్లకు మందికి పైగా భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుని గంగా నదిలో పుణ్య స్నానాలు చేయడంతో భక్తి పారవశ్యంతో భారతదేశం పరిఢవిల్లుతోంది. అయితే మహా కుంభమేళాలో ఒక అద్భుతం కనిపించింది. ఏకంగా 154 ఏళ్ల వ్యక్తి ప్రత్యక్షమయ్యాడనే వార్త సంచలనం రేపుతోంది. మానవుడి సాధారణ జీవితం వందేళ్లు ఉండగా.. 150 ఏళ్లు దాటిన సాధువు కనిపించిన వీడియో వైరల్‌గా మారింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Meerpet Gurumurthy Case: 'మృదు స్వభావి కాదు మృగాడు'.. పూసగుచ్చినట్టు గురుమూర్తి హత్య కేసు ఇదే!


ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గంగానది ఒడ్డున మహా కుంభమేళా జరుగుతోంది. పుణ్యస్నానాలు ఆచరించడానికి ఎక్కడెక్కడి నుంచో సాధావులు, నాగ సాధువులు తరలివస్తున్నారు. కోట్లాది మంది సాధువులు, అఖాడాలు తరలివస్తుండగా ఈ క్రమంలోనే ఒక సాధువు కనిపించాడు. ఆరుడగులు కాకుండా ఏడగుగుల ఎత్తు.. బక్క పలుచని సాధువు కనిపించాడు. అతడి వయసు దాదాపు 154 ఏళ్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

Also Read: Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్‌ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్‌ వేడుక


మహా కుంభమేళాలో అతడు పుణ్యస్నానం ఆచరించిన అనంతరం మహా శివుడికి పూజలు చేస్తూ సాధువు కనిపించాడు. అతడికి సంబంధించిన వీడియో నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తోంది. ఆ సాధువు హిమాలయాల ప్రాంతం నుంచి వచ్చాడని తెలుస్తోంది. హిమాలయాల్లో మంచు ప్రదేశాల్లో ఉన్న వ్యక్తి ప్రత్యేక ఆహారం పొందుతూ ఉండడం వలన ఇంతకాలం బతికాడని చర్చ జరుగుతోంది. అయితే అతడి వయసుకు సంబంధించి స్పష్టత లేదు. సాధువు వయసు 154 ఏళ్లు అని నిర్ధారణ చేయలేమని కొందరు చెబుతున్నారు.

వయసుపై సందేహాలు?
ఒక మనిషి అంతటి వయసు కలిగి ఉండడం అసాధ్యమని.. మహా కుంభమేళాలో కనిపించిన సాధువు వయసు 115 ఉండవచ్చని అక్కడి అధికారులు వెల్లడిస్తున్నారు. అతడి వయసుకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది. ఒకవేళ అతడి వయసు 154 ఏళ్లు వాస్తవమైతే మాత్రం వైద్య నిపుణులు అతడి ఆరోగ్య రహాస్యంపై అధ్యయనం చేసే అవకాశం ఉంది. ఈ సందర్భంగా సాధువుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.




స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.