Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్‌ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్‌ వేడుక

Mutton Biryani Dispute In Hotel Marriage Reception Break: ఘనంగా పెళ్లి చేసుకుని బంధుమిత్రులకు విందు ఏర్పాటుచేయగా.. హోటల్‌ నిర్వాహకులు సక్రమంగా ఆహారం వడ్డించకపోవడంతో గొడవ జరిగి లొల్లి లొల్లయ్యింది. దీనికి కారణం మటన్‌ బిర్యానీ కావడం గమనార్హం.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 28, 2025, 01:09 PM IST
Mutton Biryani: పెళ్లి విందులో 'మటన్‌ బిర్యానీ' లొల్లి.. ఆగిపోయిన రిసెప్షన్‌ వేడుక

Marriage Reception Break: ఎంతో ఘనంగా వివాహం చేసుకుని పెళ్లికి రాని వారి కోసం విందు ఏర్పాటు చేయగా.. హోటల్‌ నిర్వాహకుల కారణంగా వివాదాస్పదంగా మారింది. చెప్పిన మెనూ ప్రకారం వడ్డించకపోవడమే కాకుండా మటన్‌ బిర్యానీలో ముక్కలు తక్కువ కావడం.. మటన్‌కు బదులు వేరే జంతు మాంసం వేయడంతో గొడవకు దారి తీసింది. వేడుకకు వచ్చిన బంధుమిత్రులు, కుటుంబసభ్యులు నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటన చివరకు పోలీస్‌ స్టేషన్‌కు చేరడంతో వైరల్‌గా మారింది. ఈ సంఘటన ఎక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో జరిగింది.

Also Read: BRS Party MLA: బీఆర్ఎస్ పార్టీలోకి మరో ఫిరాయింపు ఎమ్మెల్యే? కీలక పరిణామంతో కన్ఫార్మ్

కాకినాడ జిల్లా తూరంగి హెల్త్ సూపర్‌వైజర్ షేక్ ఇబ్రహీం వివాహం ఘనంగా జరిగింది. వివాహానంతరం విందు కోసం రమణయ్యపేట ఇండస్ట్రియల్ ఏరియాలోని సెవెన్ స్కా హోటల్‌లో రిసెప్షన్‌ నిర్వహించుకునేందుకు మాట్లాడుకున్నారు. విందుకు వచ్చే బంధుమిత్రులు, కుటుంబసభ్యుల కోసం 250 ప్లేట్లు మటన్ బిర్యాని ఆర్డర్ ఇచ్చారు. మంగళవారం రాత్రి రిసెప్షన్‌ జరగాల్సి ఉండగా.. హోటల్ నిర్వాహకులు భోజనాలు సక్రమంగా వడ్డించలేదు.

Also Read: Mauni Amavasya: రేపు మౌని అమావాస్యకు ఈ దానాలు చేస్తే ఆకస్మిక ధనలాభం.. పూర్వీకుల ఆత్మశాంతి

రుచికరంగా.. పొడి పొడిగా ఉండాల్సిన మటన్‌ బిర్యానీ ముద్దగా ఉండడంతో బంధుమిత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికితోడు మటన్‌కు బదులుగా వేరే జంతు మాంసం కలిసిందని ఆరోపించారు. ఈ అనుమానంతో అతిథులు బిర్యానీ తినకుండా వదిలిపెట్టేశారు. ఈ వ్యవహారంపై ఇబ్రహీం కుటుంబసభ్యులు హోటల్‌ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. బిర్యానీ బాగాలేదని చెప్పినా పట్టించుకోకపోవడంతో బంధుమిత్రులు హోటల్‌ ముందు ఆందోళన చేశారు.

ఆర్డర్ ఇచ్చిన బిర్యానీకి రూ.27,000 బిల్లు తీసుకుని హోటల్ నుంచి బయటకు వెళ్లిపోవాలని హోటల్ యాజమాన్యం బెదిరింపులకు పాల్పడింది. దీంతో బంధుమిత్రులు పోలీసులకు, ఫుడ్‌ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుతో హోటల్‌కు వచ్చిన పోలీసులు ఆహార నమూనాలు సేకరించారు. ఆహారం పరిశీలించి నివేదిక ఇస్తామని పుడ్ ఇన్‌స్పెక్టర్ చెప్పారు. కాగా ఈ సంఘటన కాకినాడలో చర్చనీయాంశమైంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త చక్కర్లు కొడుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x