Friendship Day Wishes: స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు, మీరు కూడా ఇలా ప్రత్యేకంగా విష్ చేయండి
Friendship Day Wishes in Telugu and English: A Friend in Need is a friend in deed అన్నారు. ఇలాంటి స్నేహితులకే ఈ స్నేహితుల దినోత్సవం అంకితం. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్‌షిప్ డే జరుపుకోవడం ఆనవాయితీ. రేపు ఆగస్టు 4వ తేదీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా మీ స్నేహితులను ఇలా విష్ చేయండి.
Friendship Day Wishes in Telugu and English: ఆగస్టు నెలలో అన్నీ ప్రత్యేకమైన రోజులే. స్నేహితుల రోజు, అన్నాచెల్లెల్ల రోజు, స్వాతంత్ర్య దినోత్సం, కృష్ణుడి పుట్టిన రోజు ఇలా చాలా ప్రత్యేకతలున్నాయి. సృష్టిలో తీయనైనదిగా భావించే స్నేహబంధం గురించి చాటిచెప్పేదే ఈ ఫ్రెండ్‌షిప్ డే. మరి మీ స్నేహితులకు విషెస్ ఎలా చెప్పాలని ఆలోచిస్తుంటే మీ కోసం ఇక్కడ తెలుగు, ఇంగ్లీషులో కొన్ని విషెస్, గ్రీటింగ్స్.
ప్రపంచవ్యాప్తంగా స్నేహితుల దినోత్సవం అనేది 1958లో జాయ్స్ హాల్ ఈ ఫ్రెండ్‌షిప్ డే ఆలోచన ప్రారంభించాడు. జీవితంలో స్నేహానికి, స్నేహితునికి ఉన్న విలువ గురించి చెప్పేందుకు, స్నేహబంధాన్ని సెలెబ్రేట్ చేసుకునేందుకు ఓ రోజు ఉండాలని భావించాడు. అందుకే ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం రోజున ఫ్రెండ్‌షిప్ డే సెలెబ్రెట్ చేస్తూ వస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 4 అంటే రేపు ఇంటర్నెషనల్ ఫ్రెండ్‌షిప్ డే. మరి మీ స్నేహితులకు ఎలా విష్ చేయాలని ఆలోచిస్తుంటే మీ కోసం ఇక్కడ కొన్ని విషెస్, మెస్సేజెస్ తెలుగు, ఇంగ్లీషు భాషల్లో ఇస్తున్నాం. వాటిని జస్ట్ కాపి పేస్ట్ చేసుకుని పంపిస్తే చాలు.
1. నీవెక్కడో అల్లంత దూరాన
నేనెక్కడో ఈ మూలన
మన బంధం మాత్రం గుండె చప్పుడు దూరంలో.
స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
1. May be You and me are at far distances but our friendship is close to heart beat. Happy Friendship Day 2024
2. చిలిపి చేష్టలు, సరదా మాటలతో ఎప్పుడు గడిచిపోయిందో బాల్యం
జీవితంలో చాలా గడిపేశాం. కానీ మన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటూ..
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
2. Silly jOkes and Jovial moments crossed the milestones of life but still and forever lets our friendship be continue. Happy Friendship Day 2024
3. నా జీవితంలో నీవొక భాగం
నీతో నా బంధం ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి.
నీవు నా వెంట నిలబడిన తీరు ఇప్పటికీ జ్ఞాపకమే.
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
3. You Are Precious in my life, You are the Unforgettable moment of life. I do remember the way you stand for me. Happy Friendship day 2024
4.కాదనక ఊ కొడితే అన్నీ కథలే
మూసిన కన్ను తెరవనంతవరకూ అన్నీ కలలే
వాస్తవం నా చుట్టూ ఉన్నప్పుడు..
నీవే నా వాస్తవం అయినప్పుడు...నేనెందుకు దిగులుపడాలి
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
4. Its all are stories until you say no
its all dreams till you open your eyes
Why should I Fear and Worry
when reality is surrounded me and you are the reality
Happy Friendship Day 2024
5. బాల్యం జ్ఞాపకాలు నెమరు వేసుకున్నప్పుడు
టీనేజ్ గుర్తులు వెంటాడినప్పుడు
యౌవనం పదే పదే గుర్తొచ్చినప్పుడు
ఇప్పుడు కూడా వెంటాడుతున్న నీడవు నీవే
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
5. As and when I recall childhood
silly but Memorable things at teenage
it may be of schooling or college
Whenever i try to memorise the moments
none other than you filled with all
Happy Friendship Day 2024
6. నా గురించి అణువణువూ
నాకే తెలియని ప్రతి విషయం
నన్ను నన్నుగా అర్ధం చేసుకుంటూ..
తప్పు చేసినా కాదనుకుండానే సరిచేస్తూ
ఇంకెంత కాలం నన్నుభరిస్తావు...
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
6. All you know about me
Each and Every minute thing
No one can understand me as you
How long you will bear and cover my mistakes
Happy Friendship Day 2024
7. ఒంటరితనంలో కూడా ప్రశాంతతను ఇచ్చేది స్నేహమే
ఆ స్నేహం ఇప్పుడే కాదు ఎప్పటికీ నీదే
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024, స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
7. If you are Alone
Feeling depressed
its only Friendship gives you comfort
he is the friend truly yours
Happy Friendship Day 2024
8. మీ అందరికీ మనస్ఫూర్తిగా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు
8. Happy Friendship Day 2024 to All of You lets Cheer the Day
9. నీవు నా జీవితంలో ఓ భాగమైనందుకు
నా బాల్యం నుంచి నాకు తోడుగా ఉన్నందుకు
నీ మొదటి తలపు నేనే అయినందుకు
సదా కృతజ్ఞతలతో
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
9. Its my Heartiest Gratitude to you
for being accord since childhood
and its me of your first thought
Happy Friendship Day 2024
10. నా జీవితంలో ఓ రంగుల ప్రపంచాన్ని సృష్టించావు
నా మార్గంలో ఓ దిశా నిర్దేశకుడివయ్యావు
నా ఆనందంలో, దుఖంలో నేనున్నానన్నావు..
హ్యాపీ ఫ్రెండ్‌షిప్ డే 2024
10. You Have lighten my world with colours
painted my life with joy and laughter
guided me through the life
Happy Friendship Day 2024
Also read: Friendship Day Wishes: ఫ్రెండ్‌షిప్ డే ఆగస్టు 4 మీ స్నేహితుల్నని ఇలా విష్ చేయండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook