Hardika Pandya wife Natasha Stankovic romance with another guy: టీమిండియా ఆల్‌‌రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాన్‌కోవిచ్‌ మరో వ్యక్తితో రొమాన్స్‌లో మునిగితేలుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా (Natasha Stankovic viral video) మారింది. స్టాన్‌కోవిచ్ బాల్కనీలో నిలబడి ఉండగా.. ఓ వ్యక్తి ఆమె వెనకాలే వచ్చి నడుంపై చేయి వేయడం... ఆపై ఆమె ముఖంలో ముఖం పెట్టి... భుజాల చుట్టూ చేతులు వేసి అల్లుకుపోవడం గమనించవచ్చు. ఈ వీడియో చూశాక... పాపం పాండ్యా అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నిజానికి ఈ వీడియో ఇప్పటిది కాదు. రెండేళ్ల క్రితం నాటిది. అలెగ్జాండర్ అలెక్స్ అనే ఇన్‌స్టా యూజర్ ఖాతాలో ఈ వీడియో పోస్ట్ అయింది. ఇంతకీ ఈ అలెగ్జాండర్ అలెక్స్ ఎవరంటే... ఇతనో జిమ్ ట్రైనర్. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీకి  (Disha Patani) పర్సనల్ ఫిట్‌నెస్ ట్రైనర్‌గా వ్యవహరిస్తున్నాడు. అలెగ్జాండర్, హార్దిక్ పాండ్యా భార్య స్టాన్‌కోవిచ్ బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ఇద్దరు కలిసి గతంలో టిక్‌టాక్‌ వీడియోలతో హోరెత్తించారు. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు తరచుగా తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో షేర్ చేసేవారు. పాండ్యాతో స్టాన్‌కోవిచ్ పెళ్లి తర్వాత వీరి ఫ్రెండ్‌షిప్‌కి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది.


సెర్బియా మోడల్, బాలీవుడ్ నటి స్టాన్‌కోవిచ్‌తో హార్దిక్ పాండ్యాకు (Hardik Pandya) జనవరి 1,2020న దుబాయిలో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. అదే ఏడాది జులై 30న వీరికి కొడుకు పుట్టాడు. నిశ్చితార్థం నాటికే స్టాన్‌కోవిచ్‌ గర్భంతో ఉండటంతో.. ఆ తర్వాత కొద్ది నెలలకే ఆమె ప్రసవించింది. కుమారుడు అగస్త్య ఫోటోలను ఈ జంట తరచూ తమ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తుంటారు. 2012లో తన కెరీర్‌ను ప్రారంభించిన స్టాన్‌కోవిచ్... అప్పట్లో టీవీ నటుడు అనిల్ గోనీతోనూ కొన్నాళ్లు ప్రేమలో ఉన్నట్లు చెబుతారు.


Also Read: BheemlaNayak : భీమ్లా నాయక్ నుంచి క్రేజీ అప్‌డేట్.. రానా డైలాగ్‌లు చింపేశాడు..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి