Amazing Video: ఎపుడైనా పాము తన పిల్లలకి జన్మనివ్వటం చూసారా..? మీ కోసం ఎక్స్‌క్లూజివ్ వీడియో
ఇంటర్నెట్ ప్రపంచంలో వైరల్ అయ్యే చాలా రకాల వీడియోలో వింతైన అనుభవాలను కలిగిస్తుంటాయి.. ఎప్పుడైనా పాములు.. పాము పిల్లలకి జన్మనివ్వటం చూసారా..ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియోని మీరే ఒకసారి చూడండి.
Snake Giving Birth to Her Babies: ఇంటర్నెట్ ప్రపంచం (Internet World) అనేది ఒక అద్భుతాల ప్రపంచం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇంటర్నెట్ ప్రపంచంలో వింతైన వార్తలు, వీడియోలు, ఫోటోలతో నిండి ఉంది. ఇక్కడ చూసే వాటితో మనం రకరాకాల అనుభవాలకు లోనవుతాము..
కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తే.. మరి కొన్ని ఆలోచింపజేస్తాయి.. ఇంటర్నెట్ లో వచ్చే వీడియోలు మనపై వివిధ రకాలుగా ప్రభావాన్ని చూపుతుంటాయి నిజానికి కొన్ని వీడియోలు నేరుగా ఎప్పటికీ చూడలేము.. ఆలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో వైరల్ అవుతుంది.
ఈ వైరల్ వీడియోలో ఓ పెద్ద పాము తన బిడ్డకు జన్మనిస్తున్న (Big Python Giving Birth) దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.. సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కాసేపటికే ఈ వీడియో తెగ వైరల్ (Viral Video) అవ్వటం... లక్షల్లో వ్యూస్ సొంతం చేసుకోటం.. వేలల్లో కామెంట్స్ రావటం విశేషం.
45 సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియోలో ఆకుపచ్చ రంగులో ఉన్న పెద్ద పైథాన్ ను చూడవచ్చు.. వీడియో మామూలుగానే ప్రారంభం అవుతుంది.. కానీ కాసేపటికే ఆ వీడియోలో ఉన్న సస్పెన్స్ ఒక్కసారిగా బయటపడుతుంది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోవటం తప్పనిసరి.
ఆ సస్పెన్స్ ఏంటంటే.. ? నెమ్మదిగా పాము వెనకాల నుండి మరో పిల్ల పాము బయటకు రావటం మనం చూడవచ్చు.. కేవలం 45 సెకన్లలో పాము.. పిల్ల పాముకి జన్మనిస్తుంది. కానీ పుట్టిన పాములో ఎలాంటి కదలికలు మాత్రం ఉండవు.
ఇన్‌స్టాగ్రామ్ రాయల్ పైథాన్స్ (royal_pythons) పేజీలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. నిజానికి పాములు గుడ్లు పెడతాయి.. కానీ ఈ రకం పాముల గుడ్లు వాటి పొత్తి కడుపులో చిక్కుకుపోతాయి.. ఫలితంగా గుడ్డుపైన ఉండే గట్టి పొర పాము కడుపులో ఉండిపోయి.. పాములు బయటకి వస్తాయని నిపుణులు తెలుపుతున్నారు. సాధారణంగా ఇవి ఒక కాన్పులో 20 పాములకు జన్మిస్తాయి.. అపుడపుడు వీటి సంఖ్య 40 పాము పిల్లలకు జన్మనిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి