Brazilian Football Legend Kakas Ex Wife Caroline Celico Comments On Diveorce: సాధారణంగా పెళ్లి తర్వాత భార్యభర్తల మధ్య గొడవలు రావడం కామన్. ఇద్దరు పెరిగిన వాతావరణం, పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. దీంతో ఆలోనల్లో విభేదాలు ఉంటాయి. కొందరు వీటిని నాలుగు గొడల మధ్య సమస్యలను పరిష్కరించుకుంటున్నారు. మరికొందరు అందరి మధ్యపంచాయతీలు పెట్టుకుని,కోర్టులకు కూడా వెళ్లడానికి వెనుకాడవరు. కొన్ని చోట్ల మహిళలు, భర్తలను వేధిస్తుంటారు. మరికొన్ని చోట్లలో.. మగాళ్లు కూడా తమ భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు.దీంతో ఇలాంటి ఘటనలు కోర్టులవరకు వెళ్తుంటాయి. ఒకప్పుడు పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లుచేసుకొవడానికి ఆసక్తి చూపించేవారు. ప్రతిదాంట్లో పెద్దల మాటలు వినేవారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Read More: Smita Sabharwal: ఎమోషనల్ అయిన స్మితా సబర్వాల్.. లేడీ ఐఏఎస్ పోస్టుకు సూపర్ హీరో అంటూ కామెంట్లు.. వైరల్ గా మారిన వీడియో..


కానీ నేటి యువత దీనికి పూర్తిగా భిన్నంగా మారిపోయింది. యువత ఎక్కువగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు.  కొందరు భార్యలు..  తమ భర్తలు తమ మాటలు వినడంలేదని, తమను పట్టించుకోవడం లేదని గోడవలు పడుతుంటారు. కానీ ఇంకొందరు మాత్రం కాస్తంతా వెరైటీగా ఉంటారు. భర్త అతిమంచిగా ఉన్న వీళ్లకు నచ్చదు. అందుకే డైవర్సీలకు కూడా వెళ్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఘటన కాస్తంతా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 



పూర్తి వివరాలు.. 


బ్రెజిల్ ఫుట్ బాల్ స్టార్ కాకా ఎంత ఫెమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ ఆయన వైవాహిక జీవితం మాత్రం కాస్తంత వెరైటీగా ముగిసింది. కాకా.. ప్రపంచంలో అందమైన ఫుట్ బాల్ ఆటగాళ్లో ఒకడిగా చెప్పుకుంటారు. కాకా.. 2002 ప్రపంచకలప్ లో ఎంపికై, కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. అదేవిధంగా.. 2006 FIFA ప్రపంచ కప్‌లో కూడా ఆడాడు. అతను రొనాల్డో,  రొనాల్డినో వంటి వారితో పాటు అత్యంత ప్రముఖ సభ్యులలో ఒకడు. ఇదిలా ఉండగా.. కాకా.. 2005 వ సంవత్సరంలో తన చిన్ననాటి ప్రియురాలు కరోలిన్ సెలికోను సావో పాలోలో వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లపాటు ఇద్దరి కాపురం సజావుగానే సాగింది. కానీ ఏంజరిగిందో కానీ వీరిద్దరు కూడా.. 2015లో ఇద్దరూ విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు.


తాజాగా, కాకా మాజీ భార్య..  కరోలిన్ వారి విడాకుల వెనుక ఒక ఆసక్తికరమైన కారణాన్ని వెల్లడించింది. "కాకా నాకు ఎప్పుడూ ద్రోహం చేయలేదు, అతను నాతో మంచిగా ప్రవర్తించేవాడని,  అతను నాకు అద్భుతమైన కుటుంబాన్ని ఇచ్చాడని చెప్పింది.  కానీ నేను సంతోషంగా లేను, ఏదో కోల్పోయినట్లు ఉండేదాన్ని అని చెప్పుకొచ్చింది. మెయిన్ గా సమస్య ఏమిటంటే, అతను నాకు అన్ని  విధాలుగా పర్ఫెక్ట్ గా  భాగస్వామి అని అనేక మంది బ్రెజిలియన్లు,  యూరోపియన్ వార్తా సంస్థలలో తరచుగా కథనాలు వచ్చేవి.


Read More: Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..


కానీ  అతని మంచి తనం,తన విషయంలో పర్ఫెక్ట్ గా ఉండటం తనకు వచ్చిన సమస్య అని అందుకే, తాను డైవర్స్ ఇచ్చినట్లు ఇటీవల కరోలిన్ తన మనస్సులోని విషయాన్ని తాజాగా బైటపెట్టారు. ఇదిలా ఉండగా.. 2019లో, కాకా బ్రెజిలియన్ మోడల్ కరోలినా డయాస్‌తో తన నిశ్చితార్థం చేసుకుంటున్నట్లు ప్రకటించారు. మరోవైపు, కరోలిన్ సెలీకో కూడా 2021లో ఎడ్వర్డో స్కార్పా జూలియావోను వివాహం చేసుకుంది. మాజీ బ్రెజిలియన్ ప్రపంచ కప్ ఛాంపియన్ కాకా 2017లో రిటైర్మెంట్ ప్రకటించాడు.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter