Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..

Romance In Flight:విమానంలో కపుల్ చేసిన అరాచకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక సీటుపై పడుకుని, పొట్టి నెక్కర్లు వేసుకుని చేసిన పనిని, చూసి చుట్టుపక్కల వారు షాకింగ్ కు గురయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 11, 2024, 05:37 PM IST
  • ఫ్లైట్ లో రెచ్చిపోయిన జంట..
  • ఇదేం పాడు బుద్ధి అంటూ నెటిజన్ల ఫైర్..
Romance In Flight: విమానంలో కపుల్ అరాచకం.. 4 గంటల పాటు హగ్గింగ్ చేసుకుంటూ రొమాన్స్.. వైరగా మారిన ఘటన..

Couple Public Romance In Flight Irsk Passenger: కొందరు రోడ్ల మీద ఇష్టమున్నట్లు ప్రవర్తిస్తుంటారు.  ఈ మధ్య కాలంలో యువతీ, యువకులకు సంబంధించిన రొమన్స్ కు  సంబంధించిన అనేక ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. మెట్రో స్టేషన్ లలో, బస్సులలో, ట్రైన్ లలో, పార్కులలో యువత విచ్చల విడిగా ప్రవర్తిస్తున్నారు. చుట్టుపక్కల నలుగురు చూస్తారని కూడా ఏమాత్రం మోహమాటపడటం లేదు. ఎవరు ఏమనుకుంటే మాకేంటీ సిగ్గు అన్న చందంలా ప్రవర్తిస్తున్నారు. దీంతో చుట్టుపక్కల ఉన్న వారు మాత్రం తీవ్ర అసౌకర్యానికి గురౌతుంటారు.

 

బైక్ ల మీద ఇష్టమోచ్చినట్లు ప్రయాణిస్తు, యువతీ యువకులు ఫుల్ గా, రోమాన్స్ చేసుకున్న ఘటనలు తరచుగా వార్తలలో ఉంటున్నాయి. అచ్చం ఈ కోవకు చెందిన మరో ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. ఒక జంట ఏకంగా ఫ్లైట్ లో అందరి ముందే  ఒకరిపై మరోకరు ఇష్టమున్నట్లు పడుకున్నారు. విమాన ప్రయాణంలో ఉన్న విషయం కూడా మర్చిపోయి, అతిగా ప్రవర్తించారు.

దాదాపు నాలుగు గంటల పాటు వీరు ఇలా రొమాంటికి యాంగిల్ లో పడుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్లైట్ లో ఇదేం పాడుపని అంటూ ఏకీపారేస్తున్నారు. మరికొందరు హుందాగా అందరి ముందు ఉండాలని సున్నితంగా చివాట్లు పెట్టారు.

Read More: Tigers Turn Sadhus: ఇదేం విడ్డూరం.. శనివారం ఆ జూలో పులులు మాంసం ముట్టుకోవు.. కారణం ఏంటంటే..?

మరికొందరు నెటిజన్లు.. మరీ అంతగా అతుక్కొవడం అవసరమా.. మరే ట్రాన్స్ పోర్టు వాడుకోవచ్చు కదా.. అంటూ కూడా అడ్వైజ్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది. దీనిపై ఇర్క్స్  విమానయాన సంస్థలో జరిగిన ఈ ఘటనపై ప్రస్తుతం విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

 

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News