Teen Girl Romance: నడిరోడ్డు మీద రొమాన్స్.. ఇద్దరమ్మాయిలకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన పోలీసులు..
Teen Girl Romance: ఇద్దరమ్మాయిలు హోలీ నేపథ్యంలో అతిగా ప్రవర్తించారు. బైక్ మీద విచ్చల విడిగా రోమాన్స్ చేస్తే రీల్స్ చేశారు. చుట్టుపక్కల ఉన్న వారు ఏమనుకుంటారో అని కూడా ఆలోచించకుండా చెండాలంగా ప్రవర్తించారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు దీనిపై సీరియస్ అయ్యారు.
Holi 2024 Teen Girl Hot Romance On Scooty Goes Viral: సోషల మీడియాలో కొందరు రకరకాల వీడియోలు,రీల్స్ లను తరచుగా పోస్టులు చేస్తుంటారు. వీటిలో కొన్ని ఫన్నీగా ఉంటే మరికొన్ని వెరైటీగా ఉంటాయి. డ్యాన్స్ లకు చెందిన వీడియోలు, పెళ్లిలో వెరైటీ సంఘటనల వీడియోలు, రీల్స్ లు తరచుగా వార్తల్లో ఉంటాయి. ఇక పాములకు చెందిన రకరకాల వీడియోలు, జంతువులకు సంబంధించిన వీడియోలు తరచుగా వైరల్ గా మారుతుంటాయి. సోషల్ మీడియా పుణ్యామా.. అని కొందరు ఓవర్ నైట్ లో స్టార్ లుగా మారిపోయిన సంఘటనలు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా.. కొందరు మాత్రం పబ్లిసిటీ కోసం, సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కోసం కాస్తంతా అవధులు దాటి మరీ ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి కంటెంట్ లున్న వీడియోలు తరచుగా వివాదాస్పదమౌతుంటాయి. అచ్చం ఇలాంటి కోవకు చెందిన వీడియోలు ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంటున్నాయి.
తాజాగా, ఇద్దరమ్మాయిలు ఢిల్లీ మెట్రోలో అందరి ముందు సినిమాపాటలకు రోమాన్స్ చేసుకున్నారు. మెట్రోలో ప్రయాణికులు ఉన్నారన్న కూడా పట్టించుకోకుండా ముద్దులు పెట్టుకుంటూ, ఒకరిమీద మరోకరు పడుకుంటూ జుగుప్సాకరంగా ప్రవర్తించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై ఢిల్లీ మెట్రో రైల్ కార్పోరేషన్ కూడా స్పందించింది. కానీ.. ఇది డీప్ ఫెక్ టెక్నాలజీతో తీసినవ వీడియోలు కావచ్చని కూడా వ్యాఖ్యలు చేసింది. అది కాస్త రచ్చగా మారింది.
ఈ క్రమంలో ఈ అమ్మాయిలే ఈసారి రోడ్డుమీద రంగులు పూసుకుంటూ, బైక్ మీద అతిగా ప్రవర్తించారు. ఒక యువకుడు బైక్ నడిపిస్తూ ఉంటే వెనుకాల కూర్చుని, రంగులు పూసుకుంటూ, ఒకరిపై మరోకరు పడుతూ... భార్యభర్తల మాదిరిగా బహిరంగంగానే రోమాన్స్ చేసుకుంటున్నారు. వీరి వాలంకం చూసిన వారంతా ఇదేంట్ర బాబు అంటూ చూస్తు ఉండిపోయారు. ఇక.. హోలీ ఎవరైన సెలబ్రేట్ చేసుకునే ఒక విధానం ఉంటుంది..
Read More: Viral Video: షాకింగ్ లో మహిళ.. రీల్స్ చేస్తుండగా ఆ పనికానిచ్చిన ఆగంతకుడు.. వీడియో వైరల్..
ఇలా అమ్మాయిలు ప్రవర్తించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఈ వీడియోలు నెట్టింట్లో విపరీతంగా వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు ఈ ఘటనపై సీరియస్ అయ్యారు.వెంటనే వెహికిల్ నంబర్, వీడియోలతో వీరిని గుర్తుపట్టి, ఇలాంటి పనులు చేయోద్దని మందలించారు. అంతేకాకుండా.. రూ. 33,000 జరిమానా కూడా విధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook