EPF UAN NUMBER: పీఎఫ్ అక్కౌంట్ యూఏఎన్ నెంబర్ ఎలా జనరేట్ చేసుకోవాలి
EPF UAN NUMBER: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త. యూఏఎన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మీ యూఏఎన్ నెంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
EPF UAN NUMBER: ఈపీఎఫ్ సభ్యులకు శుభవార్త. యూఏఎన్ నెంబర్‌ను ఆన్‌లైన్‌లో జనరేట్ చేసుకోవచ్చు. కేవలం 5 నిమిషాల్లో మీ యూఏఎన్ నెంబర్‌ను జనరేట్ చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
ఎంప్లాయిస్ ప్రోవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సభ్యులు ఇక నుంచి ఆన్‌లైన్‌లోనే యూఏఎన్ నెంబర్ జనరేట్ చేసుకోవచ్చు. మీ శాలరీ స్లిప్‌లో యూఏఎన్ నెంబర్ లేకపోతే..పోర్టల్‌లో తీసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్ జనరేట్ చేయాలంటే ముందుగా ఆధార్ నెంబర్‌తో లింక్ అవాలి. ఎందుకంటే ఆధార్‌తో లింక్ చేసిన మొబైల్ నెంబర్‌కు ఓ మెస్సేజ్ వస్తుంది. యూఏఎన్ జనరేట్ లేదా యాక్టివేట్ చేసేటప్పుడు ముందు ఆధార్ కార్డు(Aadhaar Card) సిద్ధంగా ఉంచుకోవాలి.
ముందుగా పోర్టల్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. తరువాత లింక్స్ విభాగంలో ఉన్న Direct UAN Allottment by Employees ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. మీరు ఆధార్ కార్డుతో లింక్ చేసిన మొబైల్ నెంబర్, క్యాప్చాను నమోదు చేసి జనరేట్ ఓటీపీపై క్లిక్ చేయాలి. ఆ తరువాత ఉద్యోగం చేస్తున్నట్టయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి. తరువాత ఎంప్లాయ్‌మెంట్ కేటగరీ ఎస్టాబ్లిష్‌మెంట్ పీఎఫ్ కోడ్ నెంబర్, ఉద్యోగంలో చేరిన తేదీ, ఐడీ ఎంచుకోవాలి. తరువాత జనరేట్ ఓటీపీపై క్లిక్ చేసి..ఓటీపీ ఎంటర్ చేయాలి. వ్యక్తిగత వివరాలు, కేవైసీ వివరాలతో పేజ్ ఓపెన్ అవుతుంది. తరువాత వివరాల్ని చెక్ చేసుకుని క్లిక్ చేయాలి. వెంటనే యూఏఎన్ నెంబర్(UAN Number) మీ మొబైల్ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది.
Also read: Google: గూగుల్ కీలక నిర్ణయం, బుక్‌మార్క్స్ సేవల నిలిపివేత
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook