Google: గూగుల్ కీలక నిర్ణయం, బుక్‌మార్క్స్ సేవల నిలిపివేత

Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పాత సేవల్ని వదిలేస్తూ కొత్త సేవల్ని పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 22, 2021, 02:15 PM IST
Google: గూగుల్ కీలక నిర్ణయం, బుక్‌మార్క్స్ సేవల నిలిపివేత

Google: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఇప్పుడు సరికొత్త నిర్ణయాలు తీసుకుంటోంది. పాత సేవల్ని వదిలేస్తూ కొత్త సేవల్ని పరిచయం చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.

ప్రముఖ సెర్చ్ ఇంజన్ గూగుల్(Google)నిర్ణయం తీసుకుంది.సెర్చింజన్‌లో ఇప్పటి వరకూ కీలకంగా ఉన్న బుక్‌మార్క్స్ ఆప్షన్‌ను గూగుల్ తొలగించింది.సెప్టెంబర్ 30 నుంచి బుక్‌మార్క్స్ ఆప్షన్ ఇకపై గూగుల్‌లో కన్పించదు.ఆ మేరకు గూగుల్ నిర్ణయం తీసుకుంది. 2005 నుంచి అందుబాటులో ఉన్న ఈ ఆప్షన్‌కు పెద్దగా యూజర్ల నుంచి ఆదరణ లేకపోవడంతో గూగుల్ ఈ సేవల్ని నిలిపివేసింది. క్లౌడ్ ఆధారంగా ఈ సేవల్ని గూగుల్ యూజర్ల కోసం అందుబాటులో ఉంచింది.సేవలు నిలిపి వేస్తున్న తరుణంలో యూజర్లు బుక్‌మార్క్స్‌ను ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చని తెలిపింది. ఎక్స్‌పోర్ట్ బుక్‌మార్క్స్(Bookmarks) ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా సేవ్ చేసుకోవచ్చు. స్టార్‌మార్క్ చేసిన వెబ్ పేజీలు, ప్రాంతాలకు ఎటువంటి ఇబ్బంది కలగదని గూగుల్ తెలిపింది. 

Also read: Aadhaar Card: ఆధార్ అప్‌డేషన్‌లో కొత్త సౌలభ్యం, ఫోటో మార్చడం ఎలా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News