Midnight Runner Pradeep Mehra: నోయిడాకు చెందిన ప్రదీప్ మెహ్రా గుర్తున్నాడు కదా.. ఇటీవల బాలీవుడ్ దర్శకుడు వినోద్ కాప్రి వీడియోతో అతను ఓవర్‌ నైట్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు ప్రదీప్ మెహ్రా ఎక్కడ కనిపించినా.. ఒక్క సెల్ఫీ అంటూ చాలామంది అతని వెంటపడుతున్నారు. మీడియా చానెళ్లు తమకు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాయి. అయితే ఈ పాపులారిటీని ప్రదీప్ మెహ్రా ఎంజాయ్ చేస్తున్నాడా.. లేక అనవసరంగా తనను పాపులర్ చేశారని ఫీల్ అవుతున్నాడా... ఓవర్‌ నైట్ పాపులారిటీ తర్వాత ప్రదీప్ మెహ్రా ఎలా ఫీల్ అవుతున్నాడో తెలుసుకునే ప్రయత్నం చేశారు వినోద్ కాప్రి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రదీప్ మెహ్రాను కలిసి అతని ఫీలింగ్స్‌ను తెలుసుకున్నాడు. దానికి సంబంధించిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అందులో ప్రదీప్ మెహ్రా మాట్లాడుతూ... 'జనాలు నన్ను పాపులర్ చేస్తున్నారు. అయితే నేనేదో గాల్లో తేలిపోతున్నట్లుగా కనిపించడం నాకిష్టం లేదు. ఇలాగే ఎక్కువ పాపులారిటీ వస్తే.. అది నా లక్ష్య సాధనకు ఆటంకంగా మారుతుంది. నేను లక్ష్యంపై ఫోకస్ పెట్టలేను. ఎక్కువ ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా నాకిష్టం లేదు. నా సక్సెస్ నేనేంటో చెప్పాలి. అందుకు నేను మౌనంగా కష్టపడాలనుకుంటున్నా. ఈ క్రమంలో నేను ఫేమ్‌కి దూరంగా ఉండాలనుకుంటున్నా.' అని ప్రదీప్ చెప్పుకొచ్చాడు. ప్రదీప్ తాజా వీడియో కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 


ఎవరీ ప్రదీప్ మెహ్రా.. :


ప్రదీప్ మెహ్రా ప్రస్తుతం నోయిడాలోని సెక్టార్ 16లో ఉన్న మెక్ డొనాల్డ్‌లో పనిచేస్తున్నాడు. ఎప్పటిలాగే ఇటీవల ఓరోజు రాత్రి 12 గంటలకు తన విధులు ముగించుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే బైక్ పైనో, ఆటోలోనో కాదు. పరిగెత్తుతూ అతను ఇంటి వైపు అడుగులు వేస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డుపై అటుగా వచ్చిన బాలీవుడ్ డైరెక్టర్ వినోద్ కాప్రి.. ప్రదీప్ మెహ్రాను చూసి కారు స్లో చేశాడు. 


నేను మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాను.. వచ్చి కారెక్కు అంటూ వినోద్ కాప్రి ఆ యువకుడికి లిఫ్ట్ ఆఫర్ చేశాడు. పరిగెత్తుతూనే వినోద్ కాప్రి ఆఫర్‌ను ఆ యువకుడు సున్నితంగా తిరస్కరించాడు. తాను రోజూ తన ఇంటికి ఇలాగే వెళ్తానని.. లిఫ్ట్ వద్దని చెప్పాడు. ఎందుకిలా రోజూ పరిగెత్తడమని వినోద్ కాప్రి అడగ్గా... ఆర్మీలో చేరాలనేది తన కల అని తెలిపాడు. అయితే ఉదయాన్నే రన్నింగ్‌కి వెళ్లొచ్చు కదా.. ఇప్పుడెందుకు అని వినోద్ ప్రశ్నించాడు. ఉదయాన్నే లేచి వంట చేసి.. బాక్స్ పెట్టుకుని పనికి వెళ్లాల్సి ఉంటుందని.. అందుకే రాత్రి డ్యూటీ అయిపోయాక ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తానని చెప్పాడు.


రోజుకు 10కి.మీ రన్నింగ్ చేస్తానని వినోద్‌తో చెప్పాడు. సరే.. డిన్నర్ అయినా చేద్దాం రా అంటూ వినోద్ యువకుడిని పిలవగా.. అందుకు కూడా అతను తిరస్కరించాడు. ఇంటి వద్ద తన అన్న ఎదురుచూస్తుంటాడని.. ఇంటికి వెళ్లి ఇద్దరికీ వంట చేయాలని చెప్పాడు. తన అన్న నైట్ షిఫ్ట్‌కి వెళ్తాడని.. అతనికి సమయం ఉండదు కాబట్టి తానే వంట చేసి పెడుతానని తెలిపాడు. తల్లిదండ్రులు ఏం చేస్తారని అడగ్గా.. తల్లి అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నట్లు చెప్పాడు. అంతా విన్నాక.. సరే ఈ ఒక్కరోజు నేను డ్రాప్ చేస్తా రా అంటూ మళ్లీ లిఫ్ట్ ఆఫర్ చేశాడు. ఒక్క రోజే కదా అని కారెక్కితే తన ప్రాక్టీస్‌కి ఆటంకం కలుగుతుందని ప్రదీప్ బదులిచ్చాడు.


ప్రదీప్ పట్టుదలకు, అతను కష్టపడుతున్న తీరుకు వినోద్ కాప్రి ఆశ్చర్యానికి లోనయ్యాడు. ప్రదీప్ రన్నింగ్ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని వినోద్ అతనితో చెప్పాడు. నన్నెవరు గుర్తిస్తారని ఆ యువకుడు అడగ్గా... ఒకవేళ వైరల్ అయితే.. అని వినోద్ పేర్కొన్నాడు. వైరల్ అయితే కానీ.. నేనేమీ తప్పు పని చేయట్లేదు కదా.. అని ప్రదీప్ బదులిచ్చాడు. వినోద్ కాప్రి ప్రదీప్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అది వైరల్ అయింది. లక్ష్య సాధన కోసం ప్రదీప్ మెహ్రా కష్టపడుతున్న తీరుకు, అతని మాటలకు నెటిజన్లు ఫిదా అయ్యారు.



Also Read: TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్షల తేదీలివే


Also Read: Nayanatara-Vignesh Shivan: స్టార్ హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా..? 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook