TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్షల తేదీలివే..

Telangana EAMCET and ECET schedule: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఎంసెట్ పరీక్షను జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 22, 2022, 05:25 PM IST
  • తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ విడుదల
  • ప్రకటించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
  • పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి
TS EAMCET and ECET schedule: తెలంగాణ ఎంసెట్, ఈసెట్ షెడ్యూల్ ఖరారు... పరీక్షల తేదీలివే..

Telangana EAMCET and ECET schedule: తెలంగాణలో ఎంసెట్, ఈసెట్ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. ఎంసెట్ పరీక్షను జూలై 14, 15, 18, 19, 20 తేదీల్లో నిర్వహించనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈసెట్ పరీక్షను జూలై 13న నిర్వహించనున్నట్లు వెల్లడించారు. 23 రీజనల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. మంగళవారం (మార్చి 22) జరిగిన రాష్ట్ర ఉన్నత విద్యా మండలితో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

ఎంసెట్‌లో ఇంజనీరింగ్‌కి సంబంధించి 18,19,20 తేదీల్లో, అగ్రికల్చర్‌కు సంబంధించి జూలై 14, 15 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష తేదీలు, ఫీజు, దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలతో కూడిన నోటిఫికేషన్‌ను త్వరలోనే విడుదల చేయనున్నారు. పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు అధికారులంతా సమిష్టిగా కృషి చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 

కాగా, తెలంగాణలో మే 6వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. మే 6 నుంచి మే 23 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, మే 7 నుంచి మే 24 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్స్ పరీక్షల కారణంగా ఇంటర్ పరీక్షలను రీషెడ్యూల్ చేశారు. ఇంటర్ పరీక్షలు వెనక్కి జరగడంతో ఎంసెట్ పరీక్ష జూలైలో నిర్వహించాలని తాజా సమావేశంలో మంత్రి సబితా, ఉన్నత విద్యామండలి అధికారులు నిర్ణయించారు.

Also Read: Nayanatara-Vignesh Shivan: స్టార్ హీరోయిన్ నయనతార తల్లి కాబోతుందా..? 

Also read: Lalu Yadav Health: మరింతగా క్షీణించిన లాలూ యాదవ్ ఆరోగ్యం.. ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించేందుకు ఏర్పాట్లు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News