స్వయం సమృద్ధి భారత్, లోకల్ టు వోకల్ ( Local to Vocal ) ఇప్పుడివే కొత్త నినాదాలు. చైనీస్ యాప్ ( Chinese App ) టిక్‌టాక్ నిషేధం ( TikTok ban ) తో ఈ నినాదాలకు మరింత ప్రాధాన్యత పెరిగింది. అందుకే టిక్‌టాక్ ను పోలి ఉండే కొత్త యాప్‌ల ఆవిష్కరణ కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నయి. ఇందులో ప్రముఖంగా చెప్పుకోవల్సింది పాప్ ఇన్ ( Pop-in ) .


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ఇండో చైనా సరిహద్దు ( Indo china Border dispute ) వివాదం నేపధ్యంలో చైనా దేశానికి చెందిన 59 యాప్ ( 59 Apps banned ) లను భారత ప్రభుత్వం నిషేధించింది. ఇందులో ప్రముఖంగా ప్రస్తావించాల్సింది టిక్‌టాక్ యాప్ ( Tiktok App ) గురించి. ఎందుకంటే టిక్‌టాక్ యాప్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న 26 కోట్ల యూజర్లలో 11 కోట్ల మంది భారతీయులే. ఇప్పుడు ఒక్కసారిగా టిక్‌టాక్ యాప్పై నిషేధం విధించడంతో ప్రత్యామ్నాయం అవసరం ఏర్పడింది. ముఖ్యంగా టిక్‌టాక్ ఆదారంగా సెలెబ్రిటీలుగా మారిన ఎందరికో. మరోవైపు స్వదేశీ నినాదమైన స్వయం సమృద్ధి, లోకల్ టు వోకల్ నినాదాలు వీటికి బలం చేకూరుస్తున్నాయి. Also read: Fake TikTok App: నకిలీ టిక్‌టాక్ యాప్‌తో జాగ్రత్త!


అందుకే అచ్చు గుద్దినట్టు టిక్‌టాక్ లా ఉండే ఫీచర్స్ ను ప్రపంచానికి చూపించేందుకు ఓ యాప్ సిద్ధమవుతోంది. ఐ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ( I media and Broadcasting company )  పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ యాప్‌ను రూపొందిస్తోంది. దీని పేరు పాప్-ఇన్ ( Pop-in ) . పూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో , వినూత్నమైన ఫీచర్స్ తో తయారవుతోంది. పూర్తి దేశీయ టెక్నాలజీతో సిద్ధమవుతున్న పాప్ ఇన్ యాప్ తో భారతదేశపు సత్తాను ప్రపంచానికి చాటే అవకాశముందని ఐ మీడియా చెబుతోంది. దేశ భవిష్యత్ అంతా స్వదేశీ యాప్‌లపై ఆధారపడుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ప్రజలందరి ఆలోచనలకు అనుగుణంగా పాప్ ఇన్ యాప్ ( Pop-in )  ఉంటుందని...మరి కొద్దిరోజుల్లోనే ప్రజల ముందుకు రానుందని కంపెనీ వెల్లడిస్తోంది. Also read: Diamond Mask: డైమండ్ మాస్క్..చాలా కాస్ట్‌లీ గురూ


పూర్తి యూజర్ ఫ్రెండ్లీగా, అవసరమైనంత వీడియో అప్‌లోడింగ్ నిడివితో విభిన్నంగా ఈ పాప్ ఇన్ యాప్ ఉండబోతోందని తెలుస్తోంది.   జీ హిందుస్తాన్ టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan live here..