Jharkhand police lathi charge spos protesting video viral: నార్మల్ గా మన దేశంలో ఎక్కడైన పోలీసులు శాంతి భద్రతలకు విఘాతం కల్గకుండా కాపాడుతుంటారు. భద్రతలో అనేక మంది పోలీసులు వెర్వేరు విభాగాలకు చెందిన వారు ఉంటారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ర్యాపీడ్ యాక్షన్ ఫోర్స్, స్టేట్ పోలీస్, ఆర్మ్ డ్ రిజర్వ్, బ్లాక్ కమాండోలు ఇలా అనేక విభాగాలను మనం తరచుగా చూస్తుంటాం. ఎక్కడైన అల్లర్లు, ఏదైన ఇబ్బంది కర పరిస్థితులు ఉంటే ఇవన్ని కూడా రంగంలోకి దిగి, అధికారులంతా సమన్వయంతో పనిచేస్తారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అల్లర్లు, సమాజంలో ఇబ్బందులు కల్గించే అల్లరి మూకల్ని చెదరగొడుతుంటారు. ఇదంతా మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు చాలా యూనీటీగా ఉంటారు. ఎక్కడైన కొంచెం అల్లర్లు జరిగిన కూడా వెంటనే వాలిపోయి కంట్రోల్ చేస్తుంటారు. ఇలాంటి నేపథ్యంలో పోలీసులు తమలో తాము లాఠీ చార్జీలు చేసుకున్న ఘటన ఇప్పుడు వైరల్ గా మారింది.


పూర్తివివరాలు.. 


జార్ఖండ్ లోని రాంఛీ లో ఈ ఘటన చోటుచేసుకుంది. కొన్ని రోజులుగా స్పెషల్ పోలీసు ఆఫీసర్స్ తమను రెగ్యులరైజ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎప్పటి నుంచో ఈ వివాదం నివురు గప్పిన నిప్పులా ఉంది. అధికారులు, ప్రభుత్వం..అప్పుడు చేస్తాం.. ఇప్పుడుచేస్తామంటూ కూడా కాలాయాపన చేస్తున్నారు. దీంతో ఎస్పీవోలు తీవ్ర అసహానానికి లోనయ్యారు. వెంటనేతమ డిమాండ్ పర్కిష్కారించాలని కూడా ఏకంగా సీఎం ననివాసానికి చేరుకున్నారు. పోలీసులు యూనీఫామ్ మీదనే అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడున్న పోలీసులకు, ఎస్పీవోలకు మధ్య వాగ్వాదం జరిగింది.


ఈ క్రమంలో అక్కడి నుంచి వెళ్లిపోవాలని సీఎం హేమంత్ సోరేన్ భద్రత సిబ్బంది చెప్పారు. కానీ ఎస్పీవో పోలీసులు ఇదేం పట్టించుకోలేదు. తమ డిమాండ్ లను సీఎం హేమంత్ సోరేన్ కు చెప్తామంటూ పట్టుబట్టారు. దీంతో ఇది కాస్త లాఠీ చార్జీలు చేసుకునే వరకు వెళ్లింది. పోలీసు వర్సెస్ పోలీసు అన్న విధంగా ఘటన మారింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.


Read more: Ujjaini Bonalu 2024: సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు.. అమ్మవారి ఆవిర్బావం ఎలా జరిగిందో తెలుసా..?  


ఇదిలా ఉండగా.. నిరసన కారులతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డిజిపి), హోం సెక్రటరీతో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం వీరి పదవీ కాలాన్ని ఏడాది పొడిగిస్తూ, గౌరవ వేతనాన్ని 25 శాతం పెంచింది. పోలీసు రిక్రూట్‌మెంట్‌లో వయోపరిమితిలో సడలింపు కూడా హామీ ఇచ్చారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి