K Annamalai: ప్రభుత్వం దిగిపోయేవరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై పాదరక్షల శపథం
K Annamalai No To Wear Footwear Challenge: రాష్ట్రంలో ఎదురైన పరిస్థితుల కారణంగా ఓ నాయకుడు సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రభుత్వం దిగిపోయేవరకు తాను చెప్పులు ధరించనని సంచలన శపథం చేశారు. ఆయనే బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై.
K Annamalai Footwear Challenge: విశ్వవిద్యాలయంలో విద్యార్థిపై లైంగిక దాడి జరిగిన సంఘటనపై తమిళనాడులో తీవ్ర రాజకీయ వివాదం రేగుతోంది. డీఎంకే పరిపాలనలో శాంతిభద్రతలు వైఫల్యం చెందాయని.. మహిళలకు రక్షణ లేదని అక్కడి ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం దిగిపోయేవరకు తాను పాదరక్షలు ధరించనని శపథం చేశారు. ఆయన చేసిన శపథం సంచలనంగా మారింది.
Also Read: Traffic E Challan: ట్రాఫిక్ ఈ చలాన్ల డిస్కౌంట్లు.. పోలీస్ శాఖ సంచలన ప్రకటన
అన్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. ఈ అంశంపై తమిళ బీజేపీ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని కాషాయ పార్టీ శ్రేణులు ఆందోళన బాట పట్టారు. గురువారం కూడా నిరసన చేపట్టగా పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా కోయంబత్తూరులో నిర్వహించిన సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై సంచలన ప్రకటన చేశారు. స్టాలిన్ ప్రభుత్వం దిగిపోయే వరకు తాను చెప్పులు ధరించనని చెప్పి తాను ధరించిన షూలు తీసివేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా 48 గంటల పాటు తన ఇంటి ఎదుట దీక్ష చేస్తానని ప్రకటించారు.
Also Read: BRS Party MLA: ఆంధ్ర ప్రాంతవాసుల మనోభావాలు దెబ్బతీస్తే.. తాటతీస్తా
ఎన్నికల్లో గెలిచేందుకు డబ్బులు ఎర వేయమని.. రూపాయి పంచకుండా ఎన్నికలకు వెళ్తామని అన్నామలై తెలిపారు. ఎన్నికల్లో విజయం సాధించే వరకు చెప్పులు ధరించనని శపథం చేశారు. చెడు అంతమైపోవాలంటూ తన నివాసంలో కొరడా దెబ్బలతో మురుగన్ స్వామికి మొక్కు చెల్లించుకుంటానని ప్రకటించారు. రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు 48 గంటల పాటు ఉపవాసం చేస్తానని వెల్లడించారు. ఈ సందర్భంగా అధికారంలో ఉన్న డీఎంకే ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపారు.
విశ్వవిద్యాలయ విద్యార్థినిపై లైంగిక దాడి ఘటనపై తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా నిరసన చేపట్టారు. అయితే ఆందోళనలో పాల్గొనకుండా పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో విద్యార్థిని లైంగిక దాడి ఘటన తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. కాగా అన్నామలై, తమిళిసై గత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి చిత్తుగా ఓడిపోయారు. ప్రజాక్షేత్రంలో వీరు గెలవకపోయిన వీరు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలనే పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే అన్నామలై పాదరక్షలు ధరించనని శపథం చేశారు. మరి ఆయన శపథం నెరవేరుతుందో లేదో చూడాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.