Bengaluru BMTC Conductor Slaps Woman On Ticket Issue: దేశంలో మహిళల కోసం అనేక ప్రభుత్వాలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాయి. కొన్ని చోట్ల ఆధార్ కార్డు చూపించిన తర్వాత ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతిస్తున్నారు. మరికొన్ని చోట్ల మాత్రం మహిళలకు ఆయారాష్ట్రాల పరిధులలో బస్సులో ఉచితంగా ప్రయాణం చేయడానికి అనుమతిస్తున్నారు. ఇదిలా ఉండగా..ఇప్పటికే ఫ్రీబస్సుల వల్ల బస్సులన్ని ఎప్పుడు చూసిన ఫుల్ గా ఉంటున్నాయి. కనీసం నిలబడటానికి కూడా ఇబ్బంది పడాల్సిన పరిస్థితులునెలకొంటున్నాయి. దీంతో కొన్నిచోట్ల మహిళలు ఒకరితో మరోకరు కొట్టుకుంటున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



ఇంకొన్ని చోట్ల మహిళలు, కండక్టర్ తో గొడవలకు దిగుతున్నారు. ఒకరిపై మరోకరు బూతులు తిట్టుకుంటూ, నానా రభస చేస్తున్నారు. ఇప్పటికే బస్సులో మహిళలు గొడవలు పడిన అనేక వీడియోలు వార్తలలో నిలిచాయి. కొన్ని చోట్ల ఆధార్ కార్డుచూపించమంటే, మహిళలు కూడా కండక్టర్ ను బూతులు తిడుతూ.. దాడులకు పాల్పడిన ఘటన కూడా అనేకం చోటు చేసుకున్నాయి. దీనిపై ఇప్పటికే బస్సు సిబ్బంది ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.


పూర్తివివరాలు..


కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగామారింది.ఒక మహిళా ప్రయాణికురాని పట్టుకుని కండక్టర్ ఇష్టమున్నట్లు చావబాదింది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పోరేషన్ బస్సులో వెళుతున్నప్పుడు మహిళకు, కండక్టర్ కు మధ్య వాగ్వాదం జరిగింది. సదరు మహిళ ప్రయాణికురాలు.. బిలేకల్లి నుండి శివాజీనగర్‌కు వెళ్తుంది. టికెట్ విషయంలో వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో మాటా మాట పెరగడంతో, మహిళ కోపం పట్టలేక ఒకసారి కండక్టర్ ను కొట్టింది. అతను కూడా రెచ్చిపోయిన మహిళను ఇష్టమున్నట్లు చావబాదాడు. బస్సులొ ఉన్న కొందరు ఈ ఘటనను వీడియో తీశారు. ఆ తర్వాత సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


ఇక మహిళా ప్రయానికురాలు ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా వార్తల ఆధారంగా, కండక్టర్ శ్రీ హొన్నప్ప నాగప్ప అగసర్‌పై.. బీఎంటీసీ అధికారులు.. క్రమశిక్షణా చర్యలు తీసుకుని, సదరు కండక్టర్ ను వెంటనే సస్పెండ్ చేసినట్లు తెలుస్తొంది. మహిళా ప్రయాణికులకు పెద్దపీట వేయడానికి ఉచిత బస్సు ప్రయాణంను ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి. ఇలాంటి ఘటనల వల్ల ప్రస్తుతం ఉచిత బస్సు ప్రయాణం అనేది వివాదాస్పదంగా మారింది.


Read More: Snake Facts: పాముశరీరంలోని ఆ భాగం ఇంట్లో పెట్టుకుంటే డబ్బే డబ్బు..


ఇలాంటి ఘటనలపట్ల పోలీసులు, అధికారులు సీరియస్ గా చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. అదే విధంగా ప్రస్తుతం దీనిపై.. పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు మహిళ మొదట కొట్టడం వల్లనే కండక్టర్ కొట్టాడని, కానీ కండక్టర్ ను ఎక్కువగా తప్పు చేసినట్లు చూపించడం ఎంతవరకు సమంజసం అంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook