karnataka Bull Attacks Scooter in Begaluru Video Goes Viral:  కొన్నిరోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఇంటి నుంచి బైటకు వెళ్లాలంటేనే జనాలు జడుసుకుంటున్నారు. భానుడు, ఉదయం నుంచి చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే అనేక చోట్ల 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుంది. అత్యవసరమైతే తప్ప బైటకు రావోద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉండగా ప్రజలు ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మనుషులే కాదు. నోరులేని జీవాలు కూడా ఎండవేడిని భరించలేకపోతున్నాయి.రోడ్డు మీద ఉండే కుక్కలు, ఆవులు, ఇతర జీవులు చెట్ల నీడన, నీళ్లు ఉండే ప్రదేశాలలో ఉంటున్నాయి. ఇక సమ్మర్ లో.. కొన్నిసార్లు నోరులేని జీవాలు ఎండ వేడి ప్రభావానికి లోనౌతాయి. ఇలాంటి సందర్భాలలో అవి దాడులు చేసిన ఘటనలు కూడా అనేకం చోటు చేసుకున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



అందుకే రోడ్డుపైన జంతువులు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తాయో ఎవరు చెప్పలేరు. వాటికి దూరంనుంచి వెళ్లాలని ఇంట్లో వాళ్లు చెబుతుంటారు. కానీ కొన్నిసార్లు ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా అనుకోని ఘటనలు జరుగుతుంటాయి. అచ్చం అలాంటి ఘటన ప్రస్తుతం కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. ఇప్పుడు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


 ఒక మహిళ ఎద్దును తీసుకొని రోడ్డుపక్క నుంచి వెళ్తుంది. ఆమె ఎద్దును ఇంటింటికి తీసుకెళ్లి వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తుందని తెలుస్తోంది. అయితే... సమ్మర్ ప్రభావంను ఎద్దు భరించలేదో.. మరేంటో కానీ ఎద్దు ఒక్కసారిగా రోడ్డుపైన క్రూరంగా ప్రవర్తించింది. గంగిరెద్దు ఒక్కసారిగా ఎదురుగా వస్తున్న స్కూటరిస్టుపై దాడిచేసింది. దీంతో అతను షాక్ కు గురై కిందపడిపోయాడు. వెనుక నుంచి అప్పుడే ఒక లారీ వచ్చింది. అతను సడెన్ బ్రేక్ వేయడంతో స్కూటరిస్టు ప్రాణాలతో మిగిలాడు.


Read More: Woman Kisses King Cobra: ఇదేంది రా నాయన.. పాముతో లిప్ లాక్.. నెట్టింట వైరల్ గా మారిన వీడియో..


లారీ డ్రైవర్ ఏమాత్రం అలర్ట్ గా లేకున్న కూడా చక్రాల కింద స్కూటరిస్టు నుజ్జుగా మారేవాడు. స్కూటరిస్టును బలంగా ఢీకొట్టిన గంగిరెద్దు అక్కడి నంచి పారిపోయింది. ఈ వరుస ఘటనలతో స్కూటరిస్టు మాత్రం షాక్ లో ఉండిపోయాడు. ఆ తర్వాత చుట్టుపక్కల వారు వచ్చి స్కూటరిస్టును పక్కకు తీసుకెళ్లారు. ఈ ఘటన మాత్రం అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు నువ్వు లేచిన టైమ్ బాగుంది భయ్యా..అంటూ కామెంట్ లు పెడుతున్నారు.



 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook