KGF 2 Viral Video: కన్నడ హీరో యశ్, శ్రీనిధి శెట్టి జంటగా.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం కేజీఎఫ్ 1. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ  చిత్రం అఖండ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కిన విషయం తెలిసిందే. మొదటి భాగంతో వచ్చిన విజయంతో.. రెండో రోజు భాగంపై భారీ అంచనాలు వచ్చాయి. గత కొంతకాలంగా ఈ సినిమాపై తీవ్రంగా చర్చ సాగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కొవిడ్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన కేజీఎఫ్​ ఛాప్టర్​-2 ఎట్టకేలకు గురువారం (ఏప్రిల్ 14న) విడుదలైంది. భారీ అంచనాలకు తగ్గట్లు.. సినిమా ఉన్నట్లు సినిమా చూసినవారు చెబుతున్నారు. ఈ సినిమా రివ్యూస్​ కూడా చాలా వరకు పాజపిటివ్​గా ఉండటం గమనార్హం.


సినిమా విడుదలకు ముందు నుంచే.. ట్రైలర్​, అందులోని మాస్​ డైలాగ్స్ నెట్టింట తెగ హల్​చల్​ చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఎంతో మంది ఈ సినిమా డైలాగ్స్​కు రీల్స్​, షాట్స్​ చేయడం వంటివి చేస్తున్నారు. ప్రముఖులు సైతం ఈ సినిమా డైలాగ్స్​తో రీల్స్​ చేయడం విశేషం. అందులో చాలా రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. ప్రముఖ సోషల్ మీడియా సెలెబ్రెటీ కిలి పాల్​ చేసిన రీల్​.


ఇండియన్ సినిమా డైలాగ్స్​తో భారీగా పాపులారిటీ తెచ్చుకున్న 'కిలి పాల్' కూడా కేజీఎఫ్ 2కి సంబంధించిన రీల్ చేసాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇంతకు ముందు పుష్ప సహా ఇతర టాలీవుడ్​, బాలీవుడ్ సినిమాల డైలాగ్స్​కు చెసిన రీల్స్​ కూడా తెగ ట్రెండ్ అయ్యాయి. ఇప్పుడు వాటికి మించి.. కేజీఎఫ్​-2 లిప్​ సింగ్ వీడియో ఉంది.


ఇంతకి వీడియోలో అంతలా ఏముంది?


ఎప్పుడూ అడవుల్లో ఉండేవారి సంప్రదాయ  వేషం వేసుకుని వీడియోలు చేసే కిలి పాల్​ ఈ సారి పూర్తిగా లుక్ మార్చేశాడు. ఇప్పుడు కేజీఎఫ్ 2 సినిమాలో యాశ్ మాదిరి సూట్ వేసుకుని స్టైల్​గా రీల్ చేశాడు. బ్లాక్​ సూట్​లో యష్​ లుక్​ ఉన్నట్లుగానే కిలి పాల్​ కూడా.. వైలెన్స్​ డైలాగ్​ చెపుతూ ఓ వీడియో తీసి ఇన్​స్టాలో షేర్ చేశాడు. అతిడిని ఇంత కొత్తగా చూసిన.. ఇన్​స్టా ఫాలోవర్స్ తెగ పొగిడేస్తున్నారు. లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ పెడపుతున్నారు. మరికొందరేమో.. కేజీఎఫ్​ ఫీవర్​ ఖండాంతరాలు దాటిందంటూ చెప్పుకొస్తున్నారు.



Also read: Optical Illusion: మీ కళ్లకు పరీక్ష.. ఈ ఫొటోలో కుందేలు ఎక్కడుందో చెప్పండి


Also read: Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook