Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...

Viral Video of Lion and Turtle: ఈ చిట్టి తాబేలుకి ఎంత ధైర్యమో చూడండి.. పెద్ద పెద్ద జంతువులు సైతం సింహాన్ని చూస్తే గజగజ వణుకుతాయి.. కానీ ఈ తాబేలు మాత్రం సింహమే సైడ్ అయ్యేలా చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 15, 2022, 02:39 PM IST
  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సింహం, తాబేలు వీడియో
  • సింహనికే ఝలక్ ఇచ్చిన తాబేలు
  • ఆ వీడియో మీరూ చూసేయండి...
Viral Video: ఈ చిట్టి తాబేలుకు ఎంత ధైర్యం... దెబ్బకు సింహమే పక్కకు తప్పుకుంది...

Viral Video of Lion and Turtle: సింహం అంటే అడవికి రారాజు. సింహం జూలు విదిల్చిందంటే ఏ జంతువైనా సరే ఠారెత్తిపోవాల్సిందే. కనుచూపు మేరలో సింహం ఉందంటే చాలు... ఏ జంతువైనా అక్కడి నుంచి కనిపించకుండా మాయమైపోతాయి. ఎక్కడ సింహానికి ఆహారమవుతామేమోననే భయం వాటిని వెంటాడుతుంది. అందుకే పెద్ద పెద్ద జంతువులు సైతం సింహాన్ని చూడగానే పరుగందుకుంటాయి. కానీ ఓ తాబేలు.. సింహంతోనే పరాచకాలకు దిగింది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

దాహంతో ఉన్న ఓ సింహం ఒకచోట చిన్నపాటి మడుగులో నీళ్లు తాగుతుంటుంది. ఇంతలో చిన్న తాబేలు ఒకటి నీళ్లలో ఈదుకుంటూ సింహం వద్దకు వస్తుంది. సింహం నీళ్లు తాగుతుంటే... దాని నోట్లో తల పెట్టినంత పనిచేస్తుంది. దాని పొడవాటి మెడను ముందుకు చాచి సింహాన్ని బెదిరించినట్లు చేస్తుంది. ఆశ్చర్యంగా సింహం కూడా అక్కడి నుంచి కాస్త పక్కకు వెళ్లి మళ్లీ నీళ్లు తాగుతుంటుంది. ఇంతలో ఆ తాబేలు అక్కడికి కూడా వెళ్లి సింహాన్ని డిస్టర్బ్ చేస్తుంది. అయినా సరే సింహం దాన్ని ఏమీ అనదు. నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.

'ఆ తాబేలుకి ఎంత ధైర్యం.. కమాన్ నన్ను తిను... కమాన్.. అంటోంది...' అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. జీవితం మీద విరక్తి పుడితే ఇలాగే చేస్తారు.. అంటూ తాబేలును ఉద్దేశించి మరో నెటిజన్ కామెంట్ చేశాడు. 'ఆ సింహం పాదాలు, దవడలకు అంతా రక్తమే ఉంది. బహుశా అప్పటికే దాని కడుపు నిండింది. అందుకే తాబేలును ఏమీ అనలేదు..' అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు.finestofworld అనే ఇన్‌స్టా ఖాతా ద్వారా పోస్ట్ అయిన ఈ వీడియోకి ఇప్పటివరకూ 5 లక్షల పైచిలుకు లైక్స్ వచ్చాయి.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Finest of World (@finestofworld)

Also Read: KGF 2 DAY1 COLLECTIONS: చరిత్ర సృష్టించిన రాఖీ భాయ్.. మొదటి రోజే రూ. 135 కోట్లు.. 

Also Read: Hardik Pandya: హార్దిక్ పాండ్యాకు మరోసారి గాయం.. మూడు బంతులేసి డగౌట్ చేరుకున్న గుజరాత్ కెప్టెన్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News