Khammam katta vijayalakshmi went mother home after 5 years: మనలో చాలా మంది ఛాలెంజ్ లు వేసుకుంటారు. ఎగ్జామ్ లు అయ్యేవరకు టీవీలు చూడమని కొందరు ఒట్టులు పెట్టుకుంటారు. మరికొందరు జాబ్ వచ్చే వరకు కూడా ఇతర వాహనాలు లేకుండా బస్సులలో ప్రయాణిస్తుంటారు. నా డబ్బులతోనే టూవీలర్ కొంటానని ఒట్లు పెట్టుకుంటారు. ఇంట్లో వాళ్లు ఎప్పుడైన ఏమైన అంటే.. శపథాలు చేసుకుంటు ఉంటారు. ఇలాంటివి మనం తరచుగా చూస్తుంటాం. ఇక రాజకీయాల్లో.. కూడా శపథాలు ఒక రేంజ్ లో ఉంటాయి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేదాక.. గడ్డం తీయనని శపథం పెట్టుకున్నారు. మరికొందరు తమ అభిమాన పొలిటిషియన్ గెలిచే వరకు చెప్పులు లేకుండా తిరుగుతామని అనుకుంటూ ఓట్లుపెట్టుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



మరికొందరు తమ నేతలు, హీరోల కోసం తిరుపతిలో ప్రత్యేకమైన మొక్కులు మొక్కుకుంటారు. పచ్చబొట్లు పొడిపించుకుంటారు. ఇలాంటివి తరచుగా చూస్తుంటాం. కానీ ఇక్కడ ఒక మహిళ తన అభిమాన పొలిటిషియన్స్ చంద్రబాబు నాయుడు ఏపీకి మరల ముఖ్యమంత్రిగా అయ్యే వరకు కూడా పుట్టింట్లో అడుగు పెట్టనని శపథం చేసింది. ఇటీవల చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రి కావడంతో ఆమె తన పుట్టింటికి ఐదేళ్లతర్వాత వెళ్లింది. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



పూర్తి వివరాలు..


తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో ఈ ఘటన జరిగింది.  కేశవాపురం గ్రామానికి చెందిన కట్టా విజయలక్ష్మీకి చంద్రబాబు అంటే చెప్పలేని అభిమానం. ఈ క్రమంలో..  2019లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని, లేదంటే తన పుట్టింటికి రానని ఛాలెంజ్ చేసింది. అప్పుడు అనూహ్యంగా.. ఏపీకీ వైఎస్ జగన్ సీఎం అయ్యారు. ఈ క్రమంలో గ్రామస్థుల ముందు తాను విసిరిన ఛాలెంజ్ కు కట్టుబడి ఐదేళ్లపాటు తన పుట్టింటికి రాకుండా ఉండిపోయింది.


Read more: Video viral: వామ్మో... ప్రైవేటు పార్ట్ ను కరిచిన పాము.. షాకింగ్ వీడియో వైరల్..


ఇటీవల జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు సీఎం అవ్వడంతో 5 సంవత్సరాల తర్వాత తన పుట్టింటికి వెళ్లింది. దీంతో ఆమె తల్లిదండ్రులు, గ్రామస్థులు ఎంతో సంబరపడ్డారు. ఐదేళ్ల  తర్వాత విజయలక్ష్మికి సొంత ఊరికి రావడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు పూలు చల్లుతూ ఘనంగా స్వాగతం పలికారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter