Man Caught 25 Feet Giant King Cobra: సోషల్ మీడియాలో ఇటీవలి కాలంలో పాములకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చక్కర్లు కొడుతున్నాయి. నాగు పాము, కింగ్ కోబ్రా, అనకొండ, కొండచిలువ లాంటి పాములకు సంబందించిన వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి. ఇందులో కొన్ని వీడియోస్ చాలా చాలా ఫన్నీగా ఉంటే.. మరికొన్ని వీడియోలు భయంకరంగా ఉంటాయి. ఇంకొన్ని వీడియోస్ మాత్రం ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీ కింగ్ కోబ్రాను ఓ వ్యక్తి చాలా సులువుగా పట్టేసుకుంటాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ప్రకారం.. ఇండోనేషియాలోని ఓ ఫామ్ ఆయిల్ తోటలో భారీ కింగ్ కోబ్రా ఉంది. దాని పొడవు దాదాపుగా 20 అడుగులు ఉంది. ఉదయం పూట తోటలో పనిచేయడానికి కూలీలు రాగా.. వారికి ఈ భారీ సైజ్ కింగ్ కోబ్రా కనిపించింది. దాంతో వారందరూ బయటికి పరుగెత్తారు. అయితే అందులో ఒకరు మాత్రం ఎలాంటి భయం లేకుండా ముందడుగు వేశాడు. భారీ కింగ్ కోబ్రా తోకను పట్టుకుని పొదల్లోంచి బయటకు తీసుకొచ్చాడు. 


పొదల్లోంచి బయటికి వచ్చిన 25 అడుగుల కింగ్ కోబ్రా.. ఆ వ్యక్తిపైకి దూసుకొచ్చింది. ఒట్టిచేతులతో తోకను పట్టుకున్న ఆ వ్యక్తి.. ఏమాత్రం బెదరలేదు. నెమ్మదిగా పాము నడుము భాగాన్ని పట్టుకుని.. ఆపై తలను పట్టేశాడు. పామును పట్టే క్రమంలో కనీసం అతడి చేతిలో ఓ కర్ర కూడా లేకపోవడం విశేషం. కింగ్ కోబ్రా తల పట్టుకుని తోట లోంచి రోడ్డుపైకి తీసుకొచ్చాడు. దాని నోరు తెరిచి లోపలి భాగాన్ని అక్కడున్న అందరికి చూపించాడు. ఆ ఆయిల్ వర్కర్ పేరు 'మాస్ వాగి' అని తెలుస్తోంది. 



మాస్ వాగి ఒట్టిచేతులతో 25 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వాస్తవానికి ఈ వీడియో 2 సంవత్సరాల క్రితందే అయినా ఇప్పుడు మరోసారి వైరల్ అవుతోంది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. వీడియో చూసిన కొందరు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ వీడియోకి 8,296,473 వ్యూస్ వచ్చాయి. 


Also Read: సీక్రెట్‌గా పెళ్లిచేసుకున్న వివాదాస్పద హీరోయిన్‌.. ఏకంగా పొలిటికల్‌ లీడర్‌తో!


Also Read: Best Selling Compact SUV: కొనసాగుతున్న హ్యుందాయ్ హవా.. కాంపాక్ట్ ఎస్‌యూవీని శాసిస్తోన్న ఏకైక కారు ఇదే!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి