Snake Catcher Arjun Caught 10 feet King Cobra very cleverly: అత్యంత విషపూరితమైన పాములలో కింగ్ కోబ్రా ఒకటి. ఇది పాములన్నింటిలో కెల్లా అత్యంత పొడవైనది. ఎక్కువగా ఆగ్నేయ ఆసియాలో ఉండే కింగ్ కోబ్రా.. భారత దేశంలో కూడా అక్కడక్కడా ఉన్నాయి. కింగ్ కోబ్రా కాటు వేసిందంటే.. 10-15 నిమిషాల్లో మనిషి చనిపోతాడు. కింగ్ కోబ్రా కాటుకు భారీ ఏనుగు కూడా చనిపోతుంది. అందుకే కింగ్ కోబ్రా అంటే అందరూ హడలిపోతారు. సీనియర్ స్నేక్ క్యాచర్‌లకు మాత్రమే కింగ్ కోబ్రా తలొంచుతుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అర్జున్ అనే వ్యక్తి స్నేక్ క్యాచర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎంత డేంజరస్ కింగ్ కోబ్రాని అయినా చాలా సులువుగా పట్టుకుంటాడు. 10-12 అడుగుల కింగ్ కోబ్రాను సైతం ఉత్త చేతులతోనే పట్టుకుంటాడు. అర్జున్‌కు సొంత యూట్యూబ్‌ ఛానెల్ (Snake arjun chikkamagaluru) కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలే ఎక్కువగా ఉంటాయి. కింగ్ కోబ్రాకు సంబందించిన కొన్ని వీడియోలు ఒళ్లు గగుర్పొడుచుతాయి. మరికొన్ని మాత్రం కింగ్ కోబ్రాను కూడా ఇంత సులువుగా పెట్టొచ్చా అనేలా ఉంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చూడబోతున్నాం. 



ఓ ఇంటి వెనక గోడకు సిమెంట్ రేకు ఉంటుంది. గోడ, రేకు మధ్య ఖాళీ ప్రదేశంలోకి సుమారుగా 10 అడుగులు ఉండే కింగ్ కోబ్రా ఉంటుంది. గ్రామస్తులు పామును చూసి.. స్నేక్ క్యాచర్‌ అర్జున్‌కు విషయం చెపుతారు. ఆక్కడికి వచ్చిన అర్జున్.. చాలా ప్రయత్నాల తర్వాత కింగ్ కోబ్రాను రేకు నుంచి బయటకు తీసుకొస్తాడు. పరుగెత్తున్న కింగ్ కోబ్రా తోక పట్టుకోవడంతో.. అది పడగ విప్పి కాటేయడానికి మీదికి దూసుకొస్తుంది. అర్జున్ చాలా తెలివిగా తప్పించుకుంటాడు. చాలా సార్లు పాము మీదికొచ్చినా.. ఎలాంటి బెరుకు లేకుండా పామును పట్టుకుంటాడు. చివరకు ముందే సిద్ధంగా ఉంచిన పైపులోకి వెళ్లాలా చేస్తాడు. అది పైపుకు ఉన్న కవర్లోకి వెళ్ళగానే దాని బంధిస్తాడు. ఈ వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. 


Also Read: Ketika Sharma Images: కేతిక శర్మ స్టన్నింగ్ స్టిల్స్.. చుడీదార్‌లో అచ్చమైన తెలుగమ్మాయిలా మెరిసిపోతుందిగా!


Also Read: Rajnath Singh - Prabhas: హీరో ప్రభాస్‌ ఇంటికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook