Rajnath Singh - Prabhas: హీరో ప్రభాస్‌ ఇంటికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్!

Central minister Rajnath Singh to meet Hero Prabhas. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలవనున్నారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 14, 2022, 11:36 AM IST
  • ప్రభాస్‌ ఇంటికి కేంద్రమంత్రి
  • అనారోగ్యంతో కృష్ణంరాజు మృతి
  • చిత్ర పరిశ్రమలో విషాదం
Rajnath Singh - Prabhas: హీరో ప్రభాస్‌ ఇంటికి కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్!

Defence minister Rajnath Singh to meet Hero Prabhas in Hyderabad: పాన్ ఇండియా హీరో, టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ కలవనున్నారు. పెదనాన్న కృష్ణంరాజును కోల్పోయిన బాధలో ఉన్న ప్రభాస్‌ను రాజ్ నాథ్ సింగ్ పరామర్శించనున్నారు. సెప్టెంబర్ 16 ఉదయం ప్రభాస్ ఇంటికి కేంద్రమంత్రి రానున్నారని బీజేపీ వర్గాలు తెలిపాయి. ప్రభాస్‌తో పాటుగా కృష్ణంరాజు కుటుంబ సభ్యులను బీజేపీ తరఫున రాజ్ నాథ్ సింగ్  పరామర్శించనున్నారు.

ఇప్పటికే రెబల్ స్టార్ కృష్ణంరాజు మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సంతాపం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. బీజేపీలో చేరి కేంద్రమంత్రిగా పనిచేసిన కృష్ణంరాజు మరణం పట్ల చింతిస్తున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల బీజేపీ నాయుకులు కూడా కృష్ణంరాజు మృతి పట్ల సంతాపం తెలిపారు. కొందరు అంత్యక్రియలకు కూడా హాజరయ్యారు. ఇక శుక్రవారం కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రభాస్ ఇంటికి రానున్నారు.

60 ఏళ్లకు పైగా తెలుగు సినీ ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన రెబల్ స్టార్ కృష్ణంరాజు ఆదివారం (సెప్టెంబర్‌ 11న) అనారోగ్యంతో కన్నుమూశారు. చికిత్స పొందుతూ ఏఐజి ఆసుపత్రిలో మృతిచెందారు. కృష్ణంరాజు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. కుటుంబ సభ్యులు, సినీ రాజకీయ ప్రముఖులు, అభిమానుల మధ్య కృష్ణంరాజు అంత్యక్రియలు సోమవారం పూర్తయ్యాయి. ప్రస్తుతం సలార్, స్పిరిట్, ఆదిపురుష్, ప్రాజెక్ట్ కే చిత్రాల్లో ప్రభాస్ నటిస్తున్నారు.

Also Read: Cobra OTT Release: అప్పుడే ఓటీటీలోకి విక్రమ్‌ 'కోబ్రా'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడో తెలుసా?  

Also Read: Edible Oil Prices: ప్రజలకు శుభవార్త.. మరింత తగ్గనున్న పామాయిల్ ధరలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News