Snake Catcher Murliwale Hausla Rescued Two Dangerous King Cobras: ఇటీవల పాములకు సంబంధించిన చాలా వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం వర్షాకాలం.  వానలు పడుతుండడంతో వెచ్చదనం కోసం కొండచిలువ, నాగు పాము లాంటి పెద్దపెద్ద పాములు జనావాసాల్లోకి వస్తున్నాయి. కొన్నికొన్ని సందర్భాల్లో ఇంట్లోకి కూడా దూరేస్తున్నాయి. ఇంట్లో దూరిన పాములను చూసి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. ఇక స్నేక్‌ క్యాచర్‌లు వచ్చి వాటిని పట్టుకుని అడవుల్లో వదిలేస్తున్నారు. తాజాగా 15 అడుగుల కింగ్ కోబ్రా స్నేక్‌ క్యాచర్‌కు కూడా చుక్కలు చూపెట్టింది. అయినా కూడా ఎలాంటి బెరుకు లేకుండా ఒట్టిచేతులతో దాన్ని కంట్రోల్ చేశాడు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'మురళీవాలే హౌస్లా' యూపీలో డేరింగ్ స్నేక్ క్యాచర్‌. ఎంత పెద్ద స్నేక్స్‌ని అయినా చాలా ఈజీగా పట్టుకుంటాడు. ఎలాంటి ముందస్తు జాగ్రత్తలు లేకుండా.. కేవలం ఓ స్టిక్ సాయంతో ఒట్టిచేతులతోనే పట్టేస్తుంటాడు. బుసలు కొట్టే భారీ కింగ్ కోబ్రాన సైతం అలా పాడుకోబెడతాడు. మురళీకి సొంత యూట్యూబ్‌ ఛానెల్ కూడా ఉంది. ఆ ఛానెల్లో స్నేక్ క్యాచింగ్ వీడియోలను పోస్ట్ చేస్తుంటాడు. తాజాగా ఓ ఇంట్లో దూరిన రెండు కింగ్ కోబ్రాలను చాలా సునాయాసంగా పట్టాడు. 


యూపీలోని ఓ గ్రామంలోని ఇంటి ఆవరణంలో రెండు కింగ్ కోబ్రాలు చక్కర్లు కొడుతుండడంతో.. ఆ ఇంట్లోని వారు భయాందోళనకు గురవుతారు. వెంటనే స్నేక్ క్యాచర్‌ మురళీవాలే హౌస్లాకు సమాచారం ఇవ్వగా.. వర్షం పడుతున్నా కూడా అతడు ఆ ఇంటికి వస్తాడు. గడ్డిలో రెండు పాములు ఉండగా.. 10 అడుగుల కింగ్ కోబ్రాను మురళీ చాలా సులువుగా పెట్టేస్తాడు. గడ్డి తీసేసి నేరుగా చేతులతో పట్టుకుని సంచిలో వేసి బంధిస్తాడు. 



అదే గడ్డిలో 15 అడుగుల కింగ్ కోబ్రా కూడా ఉంటుంది. దాన్ని పట్టుకోవడానికి మాత్రం స్నేక్ క్యాచర్‌ మురళీవాలే హౌస్లా చాలా కష్టపడ్డాడు. ముందుగా గడ్డి మొత్తం తీసేసి కోబ్రా తోకను పట్టుకోగానే అది బుసలు కొడుతూ మీదికి దూసుకొస్తుంది. కాటేయ బాగా తృటిలో తప్పించుకుంటాడు. ఆపై పడగ విప్పిన కింగ్ కోబ్రాను తన టెక్నీక్ సాయంతో పట్టుకుని బంధిస్తాడు. ఇందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను రెండు రోజుల క్రితం పోస్ట్ చేయగా.. 8,952,239 వ్యూస్ వచ్చాయి. 


Also Read: ఎంఎస్ ధోనీకి ఇష్టమైన సబ్జెక్టు ఏంటో తెలుసా.. మీరు అస్సలు ఊహించలేరు!


Also Read: Allu Arjun - Godfather : గాడ్ ఫాదర్ లడ్డూలా ఉందన్న అల్లు అర్జున్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook