King Cobra Man Viral Video: నువ్ సూపర్ బాసూ.. ఏ సాయం లేకుండా భారీ కింగ్ కోబ్రాను ఎలా పట్టాడో చూడండి!
King Cobra Viral Video, Snake Catcher Vava Suresh caught and released Big King Cobra. కేరళలో స్నేక్ క్యాచర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వావ సురేష్.. ఉత్త చేతులతో ఓ భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు.
Man caught and released 12 feet King Cobra very easily with Bare Hands: ఈ భూమ్మీద పాములు అంటే చాలా మందికి హడల్. పామును చూడగానే ప్రాణ భయంతో ఆమడ దూరం పరుగులు తీస్తారు. కొంతమంది మాత్రం పాము కనబడితే చాలు చంపే వరకు నిద్రపోరు. ఇంకొంత మంది మాత్రం పాము కనిపిస్తే దాన్ని రక్షించకుండా ఉండలేరు. ఈ కోవకు చెందినవాడే స్నేక్ క్యాచర్ వావ సురేష్. భారీ కింగ్ కోబ్రాను సైతం సురేష్ చాలా సునాయాసంగా పట్టుకుంటాడు. గ్రామాల్లోకి వచ్చిన కింగ్ కోబ్రాలను ప్రజల భారీ నుంచి రక్షించి అడవుల్లోకి వదిలేస్తాడు.
కేరళలో ఓ కొండ ప్రాంతంలోని గ్రామంలోకి భారీ కింగ్ కోబ్రా వస్తుంది. దాదాపుగా 10-12 అడుగులు ఉన్న కింగ్ కోబ్రాను చూసి గ్రామస్థులు హడలిపోతారు. వెంటనే స్నేక్ క్యాచర్ వావ సురేష్‌కు సమాచారం అందిస్తారు. విషయం తెలుసుకున్న సురేష్.. ఆ గ్రామాన్ని వచ్చి పాము ఉన్న చోటికి వెళతాడు. పాము బండరాళ్ల మధ్యలో దాక్కుని ఉంటుంది. పక్కన ఉన్న చెత్తను క్లీన్ చేస్తుండగా.. కింగ్ కోబ్రా ఒక్కసారిగా బయటికి వస్తుంది. స్నేక్ క్యాచర్ దాన్ని పట్టుకోగానే ఒక్కసారిగా కాటేయడానికి మీదికి దీసుకొచ్చింది. అయినా కూడా అతడు వెనక్కి తగ్గడు.
కింగ్ కోబ్రా ఉత్తచేతులతోనే పట్టుకుని కొండ ప్రాంతం నుంచి రోడ్డుపై పడేస్తాడు. అనంతరం దాన్ని బంధించడానికి ప్రయత్నించగా.. సురేష్ మీదకు పలుమార్లు వస్తుంది. అయితే స్నేక్ క్యాచర్ తన టెక్నీక్ ఉపయోగించి కింగ్ కోబ్రా సంచిలో బంధిస్తాడు. ఆపై దాన్ని అడవిలోకి తీసుకెళ్లి వదిలేస్తాడు. ఈ వీడియో పాతదే అయినా సోషల్ మీడియాలో ఇప్పుడు మరోసారి ట్రెండ్ అవుతొంది. ఈ వీడియోకు 1,512,503 వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన నెటిజన్లు నువ్ సూపర్ బాసూ, వీడు మగాడ్రా బుజ్జి అని కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: NTR 30 Heroine: ఎన్టీఆర్-కొరటాల సినిమాలో హీరోయిన్ ఎవరు.. ఆ ఇద్దరిలో ఛాన్స్ ఎవరికి!
Also Read: IND vs AUS: భారత్ vs ఆస్ట్రేలియా పూర్తి షెడ్యూల్ ఇదే.. హైదరాబాద్‌లో మూడో టీ20!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook