Thailand Snake Catcher Sutee Naewhaad Grabs Deadly King Cobra With Bare Hands: ఈ భూమ్మీద చాలా మంది జనాలు చిన్న పాము కనిపిస్తేనే ఆమడ దూరం పరుగెత్తుతారు. ఇంకాస్త పెద్ద పాము కనిపిస్తే ఎమన్నా ఉందా.. ప్రాణ భయంతో వణికిపోతారు. కొందరికి అయితే పాము పేరు వింటేనే ఒళ్లంతా చెమటలు పడతాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం కళ్లముందు భారీ కింగ్ కోబ్రా ఉన్నా.. కొంచెం కూడా బెదరలేదు. కింగ్ కోబ్రా అత్యంత విషపూరితమైనదని తెలిసినా కూడా దాని కంట్రోల్ చేసి ఒట్టి చేతులతో సునాయాసంగా పట్టుకున్నాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల ప్రకారం... 14 అడుగుల పొడవు, 10 కిలోల బరువు ఉన్న కింగ్ కోబ్రా దక్షిణ థాయ్ ప్రావిన్స్ క్రాబిలో హల్చల్ చేసింది. పొదలో బుసలు కొడుతున్న కింగ్ కోబ్రాను చూసి అక్కడి జనాలు ప్రాణ భయంతో పరుగులు పెట్టారు. స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఏవో నాగ్ సబ్‌డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్‌లో వాలంటీర్ అయిన సూ నౌహాడ్ (Sutee Naewhaad) అనే స్నేక్ క్యాచర్ భారీ కింగ్ కోబ్రాను పట్టేందుకు క్రాబికి వచ్చాడు. స్నేక్ క్యాచర్ వచ్చేసరికి ఆ పాము పొదల్లో బుసలు కొడుతూ ఉంది. అది చూసిన నౌహాడ్.. జనాలను దూరంగా వెళ్ళమని చెప్పాడు. 



కళ్ల ముందే భారీ కింగ్ కోబ్రా ఉన్నా స్నేక్ క్యాచర్ సూ నౌహాడ్ అస్సలు భయపడలేదు. ముందుగా పొదల్లో ఉన్న ఆ పాముని తన టెక్నీక్‌తో రోడ్డు మీదకు తీసుకొచ్చాడు. రోడ్డు మీదకు వచ్చిన కింగ్ కోబ్రా.. సూ నౌహాడ్ చేతికి చిక్కలేదు. 20 నిమిషాలు అతడిని ముప్పు తిప్పలు పెట్టింది. ఒకానొక దశలో కాటేయబోయినా నౌహాడ్ వెనకడుగు వేయలేదు. చాలా సమయం తర్వాత నెమ్మదిగా పాము తల కింది భాగంను పట్టుకున్న స్నేక్ క్యాచర్.. ఆపై తలను పట్టుకుని బంధించాడు. ఒట్టి చేతులతో పాముని పట్టుకున్ననౌహాడ్.. ఆ తర్వాత దాన్ని అడవుల్లో వదిలేశాడు. ఈ వీడియో పాతదే అయినా ఇప్పుడు మరోసారి నెట్టింట వైరల్ అయింది. 


Also Read: 49 ఏళ్ల వయసులోనూ 'తగ్గదేలే'.. సచిన్‌ బ్యాక్‌ఫుట్‌ పంచ్‌కు దద్దరిల్లిన స్టేడియం!


Also Read: చండీగఢ్‌ యూనివర్సిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు.. చివరకు ఏం తేలిందంటే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.