Chandigarh University Video Leak: చండీగఢ్‌ యూనివర్సిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు.. చివరకు ఏం తేలిందంటే!

Chandigarh University MMS Video Leak Case end. దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పంజాబ్‌ రాష్ట్రం మొహాలిలోని చండీగఢ్ యూనివర్శిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు పడింది.   

Written by - P Sampath Kumar | Last Updated : Sep 20, 2022, 11:21 AM IST
  • చండీగఢ్‌ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు
  • చివరకు ఏం తేలిందంటే
  • సిమ్లాకు చెందిన ఇద్దరు నిందితులు
Chandigarh University Video Leak: చండీగఢ్‌ యూనివర్సిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు.. చివరకు ఏం తేలిందంటే!

Chandigarh University MMS Video Leak Case: దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన పంజాబ్‌ రాష్ట్రం మొహాలిలోని చండీగఢ్ యూనివర్శిటీ వీడియో లీక్స్ ఇష్యూకు ఎండ్‌ కార్డు పడింది. చండీగఢ్ యూనివర్శిటీ విద్యార్థులు సోమవారం తెల్లవారుజామున తమ నిరసనను ముగించారు. వీడియో లీక్స్ ఇష్యూలో ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్ట్‌ చేయడం, ఈ ఘటనపై విచారణ జరిపిస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళనను విరమించారు. ప్రైవేట్ వీడియోల లీక్​ కేసులో పోలీసులు సిమ్లాకు చెందిన ఇద్దరు నిందితులతో పాటు యూనివర్సిటీ చెందిన ఓ విద్యార్థినిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

వీడియో లీక్స్ కేసులో సన్నీ మెహతా, రాంకజ్ వర్మ అనే ఇద్దరు నిందితులను హిమాచల్ ప్రదేశ్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారు పంజాబ్ పోలీసులకు అప్పగించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సన్నీ మోహతా అని తేలింది.  
చండీగఢ్ యూనివర్సిటీ విద్యార్థినిని ప్రియుడే సన్నీ. సిమ్లాలోని రోహ్రుకు చెందిన సన్నీ.. బీఏ వరకు చదివాడు. సన్నీ తన సోదరుడితో కలిసి కేక్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. మరోవైపు రాంకజ్ వర్మ సిమ్లాలోని థియోగ్ నివాసి. అతడు ఓ ట్రావెల్ ఏజెన్సీలో పని చేస్తున్నాడు.

విద్యార్థుల పట్ల నిర్లక్ష్యంగా ఉన్నందుకు ఇద్దరు వార్డెన్‌లను సోమవారం చండీగఢ్ యూనివర్సిటీ యాజమాన్యం సస్పెండ్ చేసింది. సెప్టెంబర్ 24 వరకు 'నాన్ టీచింగ్ డేస్'గా ప్రకటించింది. ఎల్లప్పుడూ విద్యార్థులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఇక హాస్టల్ సమయాలు, విద్యార్థుల డిమాండ్‌లకు సంబంధించిన కొన్ని సమస్యలను పరిష్కరించడానికి విద్యార్థులతో కూడిన జాయింట్ కమిటీని ఏర్పాటు చేసినట్లు సమాచారం. 

పలువురు విద్యార్థినుల అభ్యంతరకర వీడియోలను యూనివర్సిటీకి చెందిన ఓ విద్యార్థిని రికార్డు చేశారన్న ఆరోపణలపై శనివారం రాత్రి క్యాంపస్‌లో నిరసనలు వెల్లువెత్తాయి. వీడియోలు కూడా లీక్ అయ్యాయని పలువురు విద్యార్థులు ఆరోపించారు. అయితే ఆ విద్యార్థిని తన ప్రైవేట్ వీడియోను తన ప్రియుడికి షేర్ చేసిందని చండీగఢ్‌ యూనివర్సిటీ తెలిపింది. మరే ఇతర విద్యార్థికి సంబంధించిన ప్రైవేట్ వీడియో పంపలేదని పోలీసులు ప్రాథమికంగా తేల్చారు. ఏడుగురు అమ్మాయిలు యూనివర్సిటీలో ఆత్మహత్యకు పాల్పడ్డారని వచ్చిన వార్తలన్నీ అవాస్తవని పేర్కొన్నారు. 

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాతో తొలి టీ20.. కార్తీక్, అశ్విన్‌లకు నిరాశే! తుది జట్టు ఇదే

Also Read: అక్టోబరులో సూర్య, కుజ, శని గ్రహాల సంచారం... ఈ రాశులవారికి ఊహించని ధనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News