King Cobra Naag Nagin: 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను పట్టుకున్న 6 ఏళ్ల బుడ్డోడు.. వీడియో చూస్తే షాక్ అవ్వడం ఖాయం..
King Cobra Naag Nagin: చాలామంది పాములంటేనే ఉరుకులు పరుగులు పెట్టేవారుంటారు. కానీ ఓ ఆరేళ్ల పిల్లాడు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రాను ఎంతో చాకచక్యంగా పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. వీడియోను చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Naag Nagin: చాలామంది అనుకోకుండా పామును కాళ్లతో తొక్కుంటారు. అంతేకాకుండా వాటికి దగ్గరగా పోయి పామని తెలిసి పరిగెత్తిన వారు ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఓ ఆరేళ్ల పిల్లాడు ఏకంగా 12 అడుగులకు కింగ్ కోబ్రా ను పట్టుకొని ఆడుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. ఈ వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కింగ్ కోబ్రాలు ఎంత ప్రమాదకరమైనవో అందరికీ తెలిసిందే. ఆ పాము పిల్లాడు తోక పట్టి లాగుతున్న ఏం అనకపోవడం వింతగా మారింది. సాధారణంగా పాములు పాములు పట్టేవారు ఎంతో జాగ్రత్తగా వాటిని బంధిస్తూ ఉంటారు. కానీ ఈ ఆరేళ్ల పిల్లాడు చాకచక్యంగా తోక పట్టి ఆడడం చర్చనీయాంశంగా మారింది.
అందరూ ఆశ్చర్యపోతున్నారు:
ఉత్తర కన్నడ జిల్లా శిరాసి తాలూకా జడ్డిగద్దె గ్రామ సమీపంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. ఆరేళ్ల చిన్నపిల్లలు 12 అడుగుల భారీ కింగ్ కోబ్రా ను ఎంతో చాకచక్యంగా పట్టుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. విరాజ్ హులేకల్ అనే చిన్నారికి తన తండ్రి చిన్నప్పటినుండే పాములు పట్టుకోవడం ఏర్పడని.. అందుకే భారీ కింగ్ కోబ్రాలను సైతం సులభంగా పట్టుకోగలుగుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఈ పిల్లాడి తండ్రి పాములు పట్టుకోవడంలో నిపుణుడని గ్రామస్తులు అంటున్నారు.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
తన పరిసర గ్రామాల్లో సంచారం చేసే పాములను ఆ పిల్లాడి తండ్రి ప్రశాంత్ హులేకల్ పట్టుకొని వాటిని సురక్షితమైన ప్రాంతాల్లో వదిలేసేవాడని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇటీవలే వానల కారణంగా వారి ఇంటి ముందు పాము సంచారం చేయడం గుర్తించి తన కుమారుడైన విరాజ్ హులేకల్ పామును పట్టించాడని అతను చెబుతున్నాడు. ఆ చిన్నారి పామును పట్టుకోవడం చూసి స్థానికులు అంతా అభినందిస్తున్నారు.
ప్రశాంత్ హులేకల్ మాట్లాడుతూ..
తన కుమారునికి చిన్నప్పుడే పాములను చాకచక్యంగా పట్టుకోవడం ప్రాక్టీస్ చేయించాడని, అప్పుడప్పుడు తన చేత కింగ్ కోబ్రాలను కూడా పట్టించాడని తెలిపాడు. అంతేకాకుండా విరాజ్ ధైర్యసాహసాలను మెచ్చుకున్నాడు. ఆ ఆరేళ్ల పిల్లాడు ఏ పామునైనా భయపడకుండా సులభంగా పట్టుకొని బంధించగలుగుతాడని ప్రశాంత్ హులేకల్ అన్నారు. పాములు పట్టుకునే పిల్లలు చాలా అరుదుగా ఉంటారని తెలిపారు. అంతేకాకుండా ఆ బాలుడికి పాములను రక్షించేందుకు ఆసక్తి ఉందని ప్రశాంత్ పేర్కొన్నారు.
Also Read: PM Modi Telangana tour: జులైలో తెలంగాణకు ప్రధాని మోదీ.. అదే కారణమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి