Small Chicken Fighting with Scary Big King Cobra: ఇంటర్నెట్ ప్రపంచం అద్భుతాలతో కూడుకున్న విభిన్నమైన ప్రపంచం. ఇక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడమే కాకుండా ట్రెండింగ్ ప్రపంచాన్ని కూడా చూడొచ్చు. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అవుతున్న మెసేజ్లు ఫోటోలు ఇతర అంశాలు సులభంగా తెలుసుకోవచ్చు. వైరల్ అవుతున్న కొన్ని వీడియోలు కొన్ని సన్నివేశాలు సోషల్ మీడియా వినియోగదారులకు ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని ఆందోళన గురి చేస్తున్నాయి. అయితే ఈ వీడియోలో జంతువులకు పాములకు సంబంధించిన వీడియోలు అధికంగా ఉండడం విశేషం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం ఏదో ఒక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో తరచుగా మనం పాములకు సంబంధించిన వీడియోలను చూస్తూనే ఉంటాం. ఆ వీడియోలో పాములు ఇతర జంతువులపై మనుషులపై దాడి చేస్తున్నవే అధికంగా ఉంటాయి. అయితే ఇప్పుడు కూడా అలాంటి ఓ వీడియో నెట్టింటా తెగ వైరల్ గా మారింది. తరచుగా చూసే వీడియోలు పాములు మనుషులపై, ఇతర జంతువుల పైనే దాడి చేసేవి చూసాం..కానీ ఇక్కడ ఓ అరుదైన సంఘటన జరిగింది. మీరు ఈ వీడియోని చూస్తే ఓ భయంకరమైన పామును కోడి తన పిల్లల కోసం దానిని ఓడించగలిగింది.



 



పిల్లలకు ఆపద వస్తే ప్రాణాలు ఇవ్వడానికైనా తల్లి సిద్ధంగా ఉంటుంది. ఈ అంశాన్ని ఓ కోడి తల్లి రుజువు చేసింది. మీరు ఈ వీడియోని గమనిస్తే.. కోడి తన పిల్లలతో ఒకచోట కూర్చుని ఉంటుంది. అది గమనించిన కోబ్రా ఆ పిల్లల వైపు వెళ్తుంది. దీంతో తల్లి కోడి గమనించి పిల్లలకు రక్షణ కల్పించేందుకు పాముతో ఫైటింగ్ చేసింది. మొదటగా తల్లి కొడుకు గాయపడినప్పటికీ పిల్లలను రక్షించేందుకు తీవ్రంగా కష్టపడి పామును చిత్తుచిత్తుగా ఓడించింది. అంతేకాకుండా ఆ పామును తీవ్రంగా గాయపరిచింది. మనం చూడవచ్చు చివరికి ఏం జరిగిందో.. ఆ తల్లి కోడి కోపాన్ని చూసి పాము ఒకటే పరుగులు పెట్టింది. మీకు ఈ సన్నివేశాలను చూస్తే అర్థమవుతుంది. తల్లి పిల్లలకి ఎలాంటి కష్టాలు వచ్చినా కాపాడేందుకు ధనవంతు సహాయం చేస్తుందని.. జీవితంలో తల్లి పాత్ర ప్రధానమైనదని ఈ సన్నివేశాలను చూసి మీకు తెలుసి రావచ్చు.


ప్రస్తుతం ఈ తల్లి కోడికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వాయిదాలుగా మారింది. ఈ వీడియోను అనే ట్విట్టర్‌ ఖాతా ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోని చూసిన నేటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ 51 సెకండ్ల నిడివి ఉన్న వీడియోకి 1.7 మిలియన్లకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియోను షేర్ అండ్ లైక్ కూడా చేశారు. నేటిజన్లో ఈ వీడియో పై తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు.


Also Read: Kaala Bhairava: శత్రువులను జయించేందుకు కాలభైరవ పూజ చేయండి.. శనివారం పూజ చేస్తే విజయం మీదే..


Also Read: Team India: ఒకే ఏడాదిలో 8 మంది కెప్టెన్లు.. కేఎల్ రాహుల్ ఫ్లాప్‌ షో.. సెలక్టర్లు ఇలా చేసినందుకే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook