King Cobra snake Video: ఒకే సారి లీటర్ నీళ్లు తాగిన పాము.. ఎందుకో తెలిస్తే ఆశ్చర్యపోతారు..
King Cobra Snake Video: ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న వీడియోలు ఎక్కువగా పాములకు సంబంధించినవే ఉంటున్నాయి. అయితే వైరల్ అవుతున్న అన్ని పాముల వీడియోల కంటే ఇది ప్రత్యేకమైనదని చెప్పవచ్చు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు.
King Cobra Snake Video: మనం అరుదుగా కింగ్ కోబ్రాలను బయట చూస్తూ ఉంటాం..అవి ఎంతో ప్రమాదకరమైనప్పటికీ వాటికి ప్రమాదం కలిగించే జంతువులు భూమి పై ఎన్నో ఉన్నాయి. కింగ్ కోబ్రా లో ఎక్కువగా అమెజాన్ అడవుల్లో సంచారం చేస్తూ ఉంటాయి. ఇంటర్నెట్ సదుపాయం పెరిగినప్పటినుంచి చాలామంది సోషల్ మీడియాలో వైరల్ వీడియోలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు.
ఈ వైరల్ అవుతున్న వీడియోలు అధికంగా జంతువులు పాములకు సంబంధించినవి ఉండడం విశేషం. ప్రస్తుతం పాము కు సంబంధించిన వైర్లు అవుతున్న వీడియోను చూసి నెటిజన్లు తెగ ఆశ్చర్యపోతున్నారు. ఓ ప్రమాదకరమైన కింగ్ కోబ్రా ఏడు రోజులపాటు చేపల వలలు చిక్కుకుంటుంది. అయితే ఆ చిక్కుకున్న పాములను స్థానికులు ఎలా బయటకు తీశారన్న సన్నివేశాలే ఈ వీడియోలో మీరు చూడొచ్చు. అంతేకాకుండా వారు ఆ పాములకు నీరు తాగించిన సంఘటన కూడా మీరు ఇందులో చూడొచ్చు.
మీరు ఈ వీడియో ఒక్కసారి గమనిస్తే.. ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఒక పాము కు సంబంధించిన వల ఉంటుంది. అందులో ఓ పాము చిక్కుకొని కొట్టుమిట్టాడుతుంది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ ను పిలిచి.. ఆ పామును బయటికి తీసేందుకు ప్రయత్నించాడు. ఆ పాము వలలో చిక్కుకొని వారం రోజులు కాగా దాహంగా ఉందని గమనించిన స్నేక్ క్యాచర్.. ఆ పాముకు బాటిల్ తో నీళ్లు పడతాడు. దీంతో ఆ పాము నీళ్లు తాగడం మొదలెడుతుంది.
ఇలా పాముకు రెండు నిమిషాల పాటు నీళ్లను పట్టించి చివరకు ఆ పామును వల నుంచి వేరు చేస్తాడు. ఇలా వేరు చేసిన పామును తన సంచిలో బంధించి అడవి ప్రాంతంలో వదిలేస్తాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ వీడియోని చూసిన నెటిజన్లు భిన్నభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఈ వీడియోను స్నేక్ క్యాచర్ తన యూట్యూబ్ ఛానల్ లో షేర్ చేశాడు. ఇప్పటికీ ఈ వీడియోను 78 లక్షలకు పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించగా.. తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తం చేస్తున్నారు. స్నేక్ క్యాచర్ పామును కాపాడడం చాలా సంతోషకరమని చాలామంది కామెంట్లలో తెలిపారు.
Also Read: Pandav Nagar Murder Case: అంజన్ దాస్ హత్యను బయట పెట్టిన శ్రద్ధ..అలా ఎలా జరిగిందంటే?
Also Read: I Love You Suma: సుమకు లైవ్లో ఐ లవ్యూ చెప్పిన కుర్రోడు... మాములుగా లేదుగా ఇది!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook