Man Drinks and Eats LIVE King Cobra : భారత దేశంలో నాగుపాము లేదా కింగ్ కోబ్రాలను పూజిస్తారు. నాగుల చవితి, శివరాత్రి రోజున నాగుపాములు గుడిలో దర్శనమిస్తుంటాయి. ఆ సందర్బాలలో వాటికి భక్తులు పాలు పోసి పూజిస్తుంటారు. భారత దేశంలో నాగుపాములు కనిపిస్తే.. దేవతగా లేదా దేవుడిగా భావించి చంపకుండా వదిలేస్తారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వాటిని చంపేస్తారు. ఇంకొన్ని దేశాల్లో మాత్రం ఏకంగా తినేస్తారు. నాగుపాము రక్తాన్ని తాగి, ఫ్రై చేసుసుని తినేస్తారు. తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండోనేషియాలోని జకార్తాలో పాముల మార్కెట్ ఉంటుంది. ఇక్కడ పెద్దపెద్ద కింగ్ కోబ్రాలను భారీ ధరలకు కస్టమర్లకు అమ్మేస్తారు. అచ్చు మన దగ్గర కోళ్లు, చేపలను అమ్మినట్టే అమ్మేస్తారు. అంతేకాదు పాములను ఫ్రై చేసుకుని తినేస్తారు. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... జకార్తాలోని పాముల మార్కెట్లోని ఓ షాప్ వద్దకు ఓ కస్టమర్ వస్తాడు. షాప్ అతను భారీ సైజ్ ఉన్న కింగ్ కోబ్రాను కొంటాడు. షాప్ అతను దాని తలను నరికి రక్తాన్ని కస్టమర్ నోట్లో పోస్తాడు. అతడు ఎంచక్కా రక్తాన్ని తాగేస్తాడు. 



షాప్ అతను కింగ్ కోబ్రా పేగులను తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి ఓ గ్లాసులో వేయగా.. కస్టమర్ తినేస్తాడు. ఆపై భారీ కింగ్ కోబ్రా శర్మాన్ని తీసి ముక్కలు ముక్కలుగా కట్ చేస్తాడు. ఆ ముక్కలకు గసగసాలు దట్టించి నిప్పులో కాలుస్తాడు. సాస్ వేసి కస్టమర్‌కు ఇవ్వగా.. అతడు చికెన్ ముక్కల మాదిరి తినేస్తాడు. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతొంది. ఈ వీడియోను 'Our Collection' అనే యూట్యూబ్ ఛానెల్లో పోస్ట్ చేశారు. మూడు నెలల క్రితం పోస్ట్ చేసిన ఈ వీడియోకి 135,234  వ్యూస్ వచ్చాయి. వీడియో చూసిన అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు. 


Also Read: నాగుపాము కాటేసినా.. రైతుల రక్షణ కోసం బూర ఊది మరీ పట్టుకున్న జోగి! మెంటలెక్కించే వీడియో


Also Read: 22 Feet King Cobra: బాప్రే.. వణికిస్తున్న 22 అడుగుల భారీ కింగ్ కోబ్రా.. ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా 5 గురు మోసిన వైనం


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి