Very Rare Snake Viral Video: నడి రోడ్డుపై గోతులు తవ్వుతున్న అరుదైన జాతి పాము.. ఆశ్చర్యపోకండి.. వీడియో చూడండి..
Biggest King Cobra Video Here: ప్రస్తుతం రోడ్డుపై గుంత దగ్గుతున్న పాముకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇలాంటి వీడియోలు చాలా అరుదుగా చూస్తామని సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ చేస్తున్నారు. నిజానికి ఈ వీడియోలో ఏముందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Biggest King Cobra Rare Video Here: కొన్ని పాములు అటు ఇటు తిరుగుతూ బుసలు కొట్టడం.. మరికొన్ని పాములు ఒక పెద్ద చెట్టు పై నుంచి మరో పెద్ద చెట్టుకు వింతగా దూకడం. మరికొన్ని పాములు మూడు అడుగులు లేచి పడగవిప్పి చప్పుడు చేయడం మనం తరచుగా సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం.. అంతేకాకుండా నిజజీవితంలో అప్పుడప్పుడు రోడ్లపై కొన్ని అరుదైన పాములు కూడా చూసి ఉంటాం.. కానీ ఎప్పుడైనా మీరు రోడ్డుపై గోతులు తీసే పామును చూశారా? చాలామందికి ఈ మాట వినగానే ఆశ్చర్యం కలగవచ్చు. ఏంటి రోడ్డుపైన గోతులు కూడా పాములు తీస్తాయా అని..? అయితే ఈ వీడియో చూస్తే మీరు పూర్తిగా ఆశ్చర్యపోతారు. ఓ పాము ఏకంగా రోడ్డుపై గొయ్యి తవ్వుతోంది. ఈ సీన్ చూసిన వారంతా అవాక్కవుతున్నారు. ఇలాంటి పాములను ఎప్పుడు చూడలేమని స్పందిస్తున్నారు కూడా.. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో భారీగా వైరల్ అవుతోంది.
ఇక ఈ వీడియోకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఓ భారీ పాము ఏకంగా మట్టిపై కాకుండా రహదారిపై గొయ్యి తవ్వడం గమనించవచ్చు. ఇది ఎక్కడో కాదు.. ఆస్ట్రేలియాలోని ఒక అటవీ ప్రాంతంలో జరిగిందట. ఇందులో పాము రోడ్డుపై మనుషులు ఎలా గడ్డపారతో దవ్వుతారు అలాగే పాము కూడా గొయ్యి తీస్తూ వస్తోంది. అంతేకాకుండా ఆ పాము గొయ్యి తీస్తున్న సమయంలో వచ్చే మట్టిని సైతం పైనకు లాగేస్తోంది. పాము తన స్ట్రాంగ్ అయిన తలతో రంద్రాన్ని బలంగా దవ్వడం మనం ఈ వీడియోలో గమనించవచ్చు. చాలా పాములు మట్టిని అటు ఇటు అనడం మనం చూసి ఉంటాం. కానీ ఈ పాము ఏకంగా తలతో గొయ్యిదవ్వడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ప్రస్తుతం పాము కు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియా అనే షేక్ చేస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టా హ్యాండిల్ @sunshinecoastsnakecatchers అనే అకౌంట్ నుంచి షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియోకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే కొన్ని జంతువులు తలదాచుకోవడానికి ఇలానే గొయ్యిలు తవ్వుతూ ఉంటూయి. అయితే ఈ పాము కూడా తలజాచుకోవడానికి రోడ్డె దొరికినట్టుంది. అందుకే రోడ్డుపై తన తనతో బలంగా గొయ్యిని తీస్తోంది. అంతేకాకుండా కొన్ని ఎడారి జాతులకు సంబంధించిన పాములు కూడా ఇలానే గొయ్యి తీస్తాయని సమాచారం. పెద్దపెద్ద గొయ్యులు తీసి అందులో తలదాచుకుంటాయని.. అలాగే బాటిళ్లలోనే పిల్లలను కూడా కంటాయని తెలుస్తోంది.
ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఇంస్టాగ్రామ్‌లో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్స్ వారి అభిప్రాయాలను కామెంట్లు కూడా చేస్తున్నారు.. కొంతమంది అయితే పాములు ఇలా గుంతలు తవ్వవు.. ఇది ఏఐ జనరేట్ చేసిన వీడియో అని వారంటున్నారు. మరి కొంతమంది అయితే ఈ పాము చేసిన పనికి నేను ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని.. ఇలాంటి వీడియోలు చాలా రేర్ గా సోషల్ మీడియాలో చూస్తామని తెలిపారు. మరి కొంతమంది అయితే ఇలాంటి వీడియోలు నేను గతంలో ఎప్పుడు చూడలేదని.. ఈ వీడియో ఎంతో ఆశ్చర్యానికి గురి చేస్తుందని వారన్నారు. ఇలా ఎవరికివారు కామెంట్ల రూపంలో వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.