King Cobra vs Mongoose real Fight Video: నాగుపాము, ముంగిస.. ఈ రెండు జంతువులు బద్ద శత్రువులు అన్న విషయం తెలిసిందే. ఈ రెండు ఎప్పుడు ఎదురుపడినా భీకర పోరు తప్పదు. ఈ పోరులో గెలుపు ఎవరిది అని చెప్పడం కాస్త కష్టమే. నాగుపాము, ముంగిస మధ్య పోరు ఎప్పుడూ రసవత్తరంగా ఉంటుంది. ఎక్కువగా ముంగిసే పైచేయి సాధించినా.. పెద్ద పెద్ద పాములు మాత్రమే అప్పుడప్పుడు విజయం సాధిస్తాయి. తాజాగా ఓ భారీ నాగుపాము, ముంగిస మధ్య జరిగిన ఫైట్ అందరిని భయాందోళనకు గురిచేస్తోంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వైరల్ అవుతున్న వీడియో ప్రకారం... ఓ అడవిలో కింగ్ కోబ్రా మరియు ముంగిస తారసపడ్డాయి. వేంటనే ఆ రెండిటి మధ్య ఫైట్  మొదలైంది. నాగుపాము, ముంగిస పైచేయి సాధించే క్రమంలో ఆ రెండిటి మధ్య ఫైట్.. భీకర పోరుగా మారింది. ఓసారి ముంగిసపై పాము దాడి చేస్తే.. ఇంకోసారి పాముపై ముంగిస దాడి చేసింది. ఓ సమయంలో పాము తలను ముంగిస పట్టుకోవడంతో అది విలవిల లాడిపోతుంది. చివరికి ఎలాగోలా తప్పించుకుని ముంగిసపై ఎదురుదాడి చేస్తుంది.

ఈ పోరులో నాగుపాము కూడా ముంగిసను చాలాసార్లు కాటేస్తుంది. అయినా కూడా ముంగిస వెనక్కి తగ్గలేదు. ఈ భీకర పోరులో పామును మట్టుపెట్టిన ముంగిస.. చివరకు అది కూడా చనిపోతుంది. చివరకు నాగుపాము, ముంగిస రెండూ చనిపోవడం ఇక్కడ పెద్ద ట్విస్ట్. ఇందుకు సంబందించిన వీడియోను africanwildlife1 అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి అప్‌లోడ్ చేయబడింది. ఈ వీడియోకి లైకుల, కామెంట్ల వర్షం కురుస్తోంది. 'సూపర్ ఫైట్' అని ఒకరు కామెంట్ చేయగా.. 'తగ్గేదేలే' అని ఇంకొకరు ట్వీట్ చేశారు. 


Also Read: విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసిన బాబర్ ఆజ‌మ్.. టీ20ల్లో అరుదైన ఘనత!


Also Read: Benefits Of Cucumber For Hair: జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. అయితే ఇది మీ కోసమే..!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.