Viral Video: ముంగిస పై దాడికి దిగిన కోమొడో.. చివరికి ఏం జరిగిందో తెలుసా? చూస్తే ఆశ్చర్యపోక తప్పరు!
Komodo Attack Mongoose: ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీటిని సోషల్ మీడియా వినియోగదారులు ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. ఈరోజు వైరల్ అవుతున్న వీడియోని చూస్తే మీరు ఆశ్చర్యపోక తప్పరు.
Komodo Dragon Attack Mongoose Viral Video: సోషల్ మీడియాలో తరచుగా జంతువులకు సంబంధించిన చాలా రకాల వీడియోలు వైరల్ గా మారుతున్నాయి. వీడియోలే సోషల్ మీడియాలో అధికంగా వైరల్ అవ్వడం విశేషం. అంతేకాకుండా ప్రస్తుతం సోషల్ మీడియాలో సింహాలు, పులులకు సంబంధించిన వీడియోలు కూడా ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. అయితే ఈ వీడియోలను చూసి కొందరు సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్య పోతే.. మరికొందరు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న వీడియో వీటికి భిన్నంగా ఉంది.
ఇటీవలే వన్య ప్రాణుల సంరక్షణ కేంద్రంలో ముంగిస, కోమొడో ఒకదానికొకటి దాడికి దిగిన వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. మీరు ఈ వీడియోని గమనిస్తే.. ముందుగా రోడ్డుపై కోమొడో (బల్లి జాతికి చెందిన సంస్కృపం) దాని దారిన అది వెళ్తుంది. ఇంతలోనే ముంగిస రోడ్డు పైకి రావడంతో కోమొడో ఒకసారిగా ఆగిపోతుంది. దీనిని గమనించిన ముంగిస.. కోమొడో పై దాడి చేస్తుంది. ఇలా అవి రెండు ఒకదానికొకటి దాడి చేసుకుంటూ ఉంటాయి. ముంగిస శక్తివంతంగా ఉండడం వల్ల కోమొడోను సులభంగా దాడి చేస్తుంది.
అంతేకాకుండా కోమొడో ముంగిస నుంచి తప్పించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అయినప్పటికీ ముంగిస దానిని వదలకుండా పట్టుకొని తన వైపు లాక్కుంటూ వెళ్తుంది. ఇలా లాక్కుంటూ వెళ్లే క్రమంలో కోమొడోకు తీవ్ర గాయాలు అవుతాయి. ఇలా చాలాసేపు ఒకదానికొకటి దాడి చేసుకుంటూ చివరికి ముంగిస దానిపై విజయం సాధిస్తుంది. ఇవి రెండు దాడి చేసుకుంటున్న సన్నివేశాలు నెట్టింట తెగ వైరల్ గా మారుతున్నాయి.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
ఈ వీడియోను ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నుంచి షేర్ చేశారు. ఈ వైరల్ అవుతున్న ఒక నిమిషం వీడియోను ఇప్పటివరకు 4 లక్షల పైగా సోషల్ మీడియా వినియోగదారులు వీక్షించారు. అంతేకాకుండా ఈ వీడియో పై నెటిజన్లు స్పందిస్తున్నారు. ఈ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో వ్యక్తపరుస్తున్నారు.
Also read: Post Office Schemes: రోజుకు 50 రూపాయలు పెట్టుబడి చాలు, 35 లక్షలు సంపాదించే అవకాశం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook