UP Election officer Reena Dwivedi New Look pics goes viral: రీనా ద్వివేది.. ఈపేరు ఎక్కడో విన్నట్టుంది కదా?. అదేనండి.. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల అధికారిగా విధులు నిర్వర్తించారు. పసుపు రంగు చీర కట్టుకుని, కళ్లకు గాగుల్స్ పెట్టుకుని, చేతిలో ఓ బాక్స్ పట్టుకుని అందరిని ఆకర్షించారు. తన అందం, స్టైల్‌తో ఒక్కసారిగా సోషల్ మీడియాలో పాపులర్ అయ్యారు. దాంతో దేశ వ్యాప్తంగా రీనా ద్వివేది పేరు మార్మోగిపోవడమే కాకుండా.. ఆమెకు భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మూడేళ్ల తర్వాత ఎలక్షన్ ఆఫీసర్‌ అయిన రీనా ద్వివేది సోషల్ మీడియాను మరోసారి షేక్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బిజీ బిజీగా ఉన్నారు. 2022 ఎన్నికల కోసం లక్నోలోని గోసాయిగంజ్ బూత్ నంబర్ 114లోని బస్తియా పోలింగ్ స్టేషన్‌లో రీనా విధులు నిర్వరిస్తున్నారు. అయితే యూపీలో నాలుగో దశ ఎన్నికలకు ముందు ఆమె గెటప్ మరోసారి నెట్టింట వైరల్ అయింది. 


2019లో ఎల్లో సారీ, స్లీవ్ లెస్ బ్లవ్‌జ్ వేసుకుని వచ్చిన రీనా ద్వివేది.. ఈ సారి మాత్రం వెస్ట్రన్ డ్రెస్‌లో తళుక్కుమన్నారు. బ్లాక్ స్లీవ్‌ లెస్ టాప్, వైట్ ప్యాంట్‌ ధరించిన రీనా.. ఈవీఎంను చేతపట్టుకుని ఎంతో హుందాగా నడుచుకుంటూ బస్తియా పోలింగ్ కేంద్రానికి వచ్చారు. ఆ సమయంలో అక్కడ ఉన్న కెమెరా మేన్స్, ప్రజలు ఆమెను ఫోటో తీశారు. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో రీనా ద్వివేది పిక్స్ కాస్తా వైరల్ అయ్యాయి. ప్రస్తుతం రీనా ద్వివేది పేరు, ఫొటోలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. 



వెస్ట్రన్ డ్రెస్ ధరించడంపై ఎలక్షన్ ఆఫీసర్‌ అయిన రీనా ద్వివేది స్పందిస్తూ.. 'తోడా చేంజ్ హోనా చాహియేనా' అని అన్నారు. ఈసారి తాను కొద్దిగా మారిపోయానని, మార్పు మంచికే అంటూ ఆమె పేర్కొన్నారు. తాను ఎప్పుడూ ఫ్యాషన్ ట్రెండ్స్‌ని ఫాలో అవుతానని, అప్‌డేట్‌గా ఉండటానికి ఇష్టపడతా అని చెప్పారు. తన ఫోటోలు వైరల్ అయితే విషయం తెలుసని, అందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. తన విధులను సక్రమంగా నిర్వర్తిస్తానని, ఈసారి ఓటింగ్ శాతం పెరుగుతుందని ఆశిస్తున్నా అని రీనా ద్వివేది చెప్పుకొచ్చారు. 


Also Read: Malaika Arora Trolls: అయ్యోరామ.. మలైకా అరోరా ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయిందా!!


Also Read: Redmi Smart LED TV X43 Offer: 14 వేల బంపరాఫర్.. అతితక్కువ ధరకే రెడ్‌మీ 43 అంగుళాల స్మార్ట్ టీవీ!!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook