Laughing or drinking banned in North Korea: ఉత్తర కొరియాలో ఆ దేశాధినేత అయిన కిమ్ జాంగ్ ఉన్ నియంత పాలన చేస్తున్నాడనే సంగతి యావత్ ప్రపంచానికి తెలిసిందే. ఇప్పటికి కూడా ఏ దేశంలో లేని కఠిన నియమ నిబంధనలు ఉత్తర కొరియాలో ఉన్నాయి. ముఖ్యంగా ప్రభుత్వానికి ఎదురు తిరిగినా, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొన్నా.. ఇక వాళ్ల పని అయిపోయినట్టే. కిమ్ జాంగ్ ఉన్ వేసే కఠిన శిక్షలు మామూలుగా ఉండవు. ఇవన్నీ అందరికి తెలిసిన విషయమే. అయితే తాజాగా ఉత్తర కొరియా మరోసారి వార్తల్లోకెక్కింది. ఈసారి కూడా ఎప్పటిలాగే తుగ్లక్ నిర్ణయాలతోనే కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లోకెక్కాడు. ఆ తుగ్లక్ నిర్ణయాలు ఏంటో తెలిస్తే మీరూ ముక్కున వేలేసుకుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఉత్తర కొరియా దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి కఠినమైన ఆదేశాలు జారీచేశాడు. తన తండ్రి, ఆ దేశ మాజీ అధినేత అయిన కిమ్ జాంగ్ చనిపోయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా (Kim Jong Il tenth death anniversary) ఆయన్ను స్మరించుకుంటూ 11 రోజుల పాటు యావత్ ఉత్తర కొరియా వాసులు సంతాప దినాలు పాటించాల్సిందిగా ఆర్డర్ పాస్ చేశాడు. సంతాప దినాలుగా పాటించే ఆ 11 రోజుల పాటు దేశంలో ఎవ్వరూ సంతోషంగా గడపరాదని (North Koreans banned from laughing or drinking) హుకుం జారీచేశాడు. ముఖ్యంగా నవ్వడం, ఆల్కహాల్ సేవించడంపై ఏకంగా నిషేధం విధించి తన నియంత పోకడలను మరోసారి బయటపెట్టాడు.


Also read : Pushpa song : పుష్ప సమంత సాంగ్‌కు మేల్‌ వెర్షన్...ఊ అంటావా పాప.. ఊఊ అంటావా పాపా పాట వైరల్..


ఎవరైనా చనిపోతే ఏడువొద్దు, బర్త్‌డేలు చేసుకోవద్దు..


విచిత్రం ఏంటంటే... డిసెంబర్ 17న కిమ్ జాంగ్ 10వ వర్థంతి సందర్భంగా ఉత్తర కొరియా వాసులు ఎవ్వరూ ఆ రోజున నిత్యవసర వస్తువులు కూడా కొనరాదని కిమ్ జాంగ్ ఉన్ (Kim Jong Un) రూల్ పాస్ చేశాడు. ఇంకా విచిత్రం ఏంటంటే.. ఈ 11 రోజుల సంతాప దినాల సమయంలో ఇంట్లో ఎవరైనా కుటుంబసభ్యులు చనిపోయినా ఏడవొద్దు. అలాగే ఇంట్లో ఎవరిదైనా పుట్టిన రోజు ఉన్నా ఆ బర్త్ డే వేడుకలు చేసుకోవద్దు. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఒకటా, రెండా.. కిమ్ జాంగ్ ఉన్ విధించిన షరతులు అన్నీ ఇన్నీ కావు. 


Who is Kim Jong iI - అసలు ఎవరీ కిమ్ జాంగ్ :
కిమ్ జాంగ్ ఉన్ నియంత పోకడ అతడితోనే ప్రారంభమైంది కాదు. అతడి తండ్రి కిమ్ జాంగ్ కూడా ఉత్తర కొరియా నియంతగా 1994 నుంచి 2011 వరకు 17 ఏళ్ల పాటు ఆ దేశాన్ని ఏలాడు. ఉత్తర కొరియాను తన చెప్పుచేతల్లో పెట్టుకుని చెప్పు కింద నలిపేసినట్టు నలిపేశాడు. ఉత్తర కొరియా వాసులకు నరకం చూపించాడు. చివరకు 69 ఏళ్ల వయస్సులో 2011 డిసెంబర్ 17న కిమ్ జాంగ్ గుండెపోటుతో కన్నుమూశాడు. 


Also read : Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!


అలా కొడుకు కిమ్ జాంగ్ ఉన్ చేతికి ఉత్తర కొరియా పగ్గాలు:


కిమ్ జాంగ్ చనిపోయాకా అతడి మూడో కొడుకు.. అందరిలో చిన్న వాడయిన కిమ్ జాంగ్ ఉన్ ఉత్తర కొరియా దేశాధినేత పదవిపై కన్నేశాడు. తండ్రికి వారసుడిగా ఉత్తర కొరియా పగ్గాలను చేతుల్లోకి తీసుకున్నాడు. వారసుడిగా దేశానికి రాజు అవడమే కాదు.. నియంత పోకడల్లోనూ తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నాడు. ఇంకా చెప్పాలంటే తండ్రిని మించిన రాక్షసుడు అనిపించుకుంటున్నాడు. అందుకే ఇలా నవ్వితే తప్పు, ఏడిస్తే తప్పు.. ఆఖరికి తన మాటను గౌరవించకుండా సంతోషంగా ఉన్నా తప్పే (Bizarre bans and punishments in North Korea) అవుతుందంటున్నాడు. అంతేకాదు.. ఆ తప్పును నేరం కిందే పరిగణిస్తూ శిక్షలు కూడా సిద్ధంగా ఉంటాయి. ఇంతకీ శిక్ష ఏంటనే కదా మీలో చాలా మందికి వచ్చిన డౌట్!! అది తెలుసుకుందామంటే ఇలాంటి నేరాలకు కిమ్ జాంగ్ ఉన్ చేతిలో శిక్ష పడిన వాళ్లెవ్వరూ ఆ తర్వాత కనిపించలేదని స్థానికులు చెబుతుంటారు.


Also read : Strange sounds from bathroom: బాత్రూమ్ నుంచి వింత శబ్ధాలు.. టైల్స్ పగలగొట్టి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook