Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Brother marries his own sister for money: ఒక వ్యక్తి తన సొంత సోదరినే పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణం కదా! అసలు ఆ ఇద్దరికీ ఎందుకు ఆ కర్మ పట్టింది ? పరిస్థితి ఏదైనా కావొచ్చు.. ఆ పని చేయాల్సిన అవరసరం ఏమొచ్చింది అనే ప్రశ్న మెదడులో పురుగు తొలిచినట్టు తొలిచేస్తోంది కదూ!!

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2021, 09:51 PM IST
Brother marries sister: ఎంత దారుణం!! సొంత చెల్లినే పెళ్లి చేసుకున్న అన్న.. ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Brother marries his own sister for money: ఒక వ్యక్తి తన సొంత సోదరినే పెళ్లి చేసుకున్నాడు. ఎంత దారుణం కదా! అసలు ఆ ఇద్దరికీ ఎందుకు ఆ కర్మ పట్టింది ? పరిస్థితి ఏదైనా కావొచ్చు.. ఆ పని చేయాల్సిన అవరసరం ఏమొచ్చింది అనే ప్రశ్న మెదడులో పురుగు తొలిచినట్టు తొలిచేస్తోంది కదూ!! అయితే, ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఏంటో ఈ వార్తా కథనంలో తెలుసుకుందాం. 

ప్రభుత్వ పథకాలతో (Govt welfare schemes) వచ్చే సొమ్మును సొంతం చేసుకునేందుకు కొంతమంది ఏం చేయడానికైనా వెనుకాడరు. ప్రభుత్వ పథకాలను దక్కించుకోవడం కోసం బతికున్న వాళ్లను రికార్డులలో చంపేసిన సందర్భాలున్నాయి. చనిపోయిన వాళ్లు బతికే ఉన్నట్టుగా రికార్డులు పుట్టించిన సందర్భాలూ ఉన్నాయి. ఇంచుమించు ఈ ఘటన విషయంలో జరిగింది కూడా అలాంటి నేరమే. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని (Uttar Pradesh) ఫిరోజాబాద్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ఇటీవలే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం సామూహిక వివాహాలు చేసుకోవాలనుకునే జంటలు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా ఆహ్వానం పలికింది. పెళ్లి చేసుకోవాలని కోరుకునే నిరుపేద జంటలకు చేయుత అందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం (Mukhyamantri Samuhik Vivaah Yojana scheme) కింద ఉత్తర్ ప్రదేశ్ సర్కారు ఈ పెళ్లిళ్లు జరిపిస్తుందన్నమాట. అలా ఈ పథకం కింద డిసెంబర్ 11న ఫిరోజాబాద్ జిల్లా తుండ్లలో 52 జంటలకు సామూహిక వివాహాలు జరిగాయి. 

Also read : Strange sounds from bathroom: బాత్రూమ్ నుంచి వింత శబ్ధాలు.. టైల్స్ పగలగొట్టి చూస్తే ఒళ్లు గగుర్పొడిచే సీన్

సీన్ కట్ చేస్తే.. ఇక్కడ జరిగిన పెళ్లిళ్లకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సామాజిక మాధ్యమాల్లో ఒక జంటను గుర్తించిన గ్రామస్తులు... ఆ ఇద్దరూ సొంత సోదరుడు, సోదరి అని అధికారులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన అధికారులు.. ఆ జంటకు ప్రభుత్వం అందించిన వివాహ కానుకలను (Wedding gifts) వెనక్కి తీసుకోవడంతో పాటు వారిపై విచారణకు ఆదేశించారు. తుండ్ల పోలీసు స్టేషన్‌లో ఈ జంటపై ఓ పోలీసు కేసు కూడా నమోదైంది.

Also read : Viral Video : పెళ్లి మండపంలోనే డ్యాన్స్ చేసిన వరుడు.. మంత్రాలు చదువుతూ స్టెప్స్ వేసిన పంతులు

ముఖ్యమంత్రి సామూహిక వివాహ యోజన పథకం (Mass weddings scheme) కింద వివాహం చేసుకునే జంటలకు ప్రభుత్వం రూ. 35 వేల ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబానికి అవసరమయ్యే పలు వస్తుసామాగ్రిని వివాహ కానుకల కింద అందజేస్తుంది. ఉత్తర్ ప్రభుత్వం (Uttar Pradesh) అందించే ఆ సొమ్ము, కానుకలు కొట్టేయడానికే వాళ్లు ఈ పెళ్లి చేసుకున్నారని ప్రాథమిక విచారణలో తేలింది. అదండీ సంగతి!!

Also read : Viral Video: ఓరి దీని ఏషాలో.. భలే నటిస్తోందే.. ముట్టుకుంటే చనిపోయినట్లుగా పడిపోతున్న పాము

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News