North Korea food crisis: ఉత్తర కొరియా తీవ్రమైన ఆహార కొరత (food shortage)ను ఎదుర్కొంటుంది. కఠినమైన కరోనా ఆంక్షలు(Corona sanctions), సరిహద్దుల మూసివేత, గతేడాది తుపానుల (typhoons) కారణంగా దేశంలో పరిస్థితులు మరింత దిగజారాయి. దీంతో 2025 వరకు పౌరులంతా తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవాల్సిందిగా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్(Kim Jong Un) పిలుపునిచ్చినట్లు సమాచారం.
ధాన్య ఉత్పత్తి ప్రణాళికను నెరవేర్చడంలో వ్యవసాయ రంగం(Agricultural sector) విఫలమైనందునే ఈ ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినట్లు కిమ్ వ్యాఖ్యానించడం గమనార్హం! మే నెలలోనే దక్షిణ కొరియా ప్రభుత్వానికి చెందిన కొరియా డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్.. ఈ ఏడాది దాదాపు పది లక్షల టన్నుల ఆహార కొరత రావచ్చని అంచనా వేసింది. ఐరాస(UNO) సైతం దేశంలో ఆకలి చావులు నమోదయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. అయితే.. ఉ.కొరియా దాన్ని కొట్టిపారేసిన విషయం తెలిసిందే.
Also read: Dinosaur in UN General Assembly: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డైనోసర్ స్పీచ్
మండిపోతున్న నిత్యావసరాల ధరలు
కొవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఉ.కొరియా 2020లో చైనా(China)తో ఉన్న సరిహద్దును మూసివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్యం నిలిచిపోయింది. మరోవైపు అణ్వాయుధాల కార్యకలాపాలకు వ్యతిరేకంగా పలు దేశాలు ఆంక్షలు విధించడంతో ఈ దేశం ఒంటరిగా మారింది. దీంతోపాటు స్థానికంగా తుపాన్లు, వరదలు పంటలను నాశనం చేశాయి. ఫలితంగా ఆహార కొరత మొదలైంది. దేశ ఆర్థిక వ్యవస్థ మరింత క్షీణించింది. డిమాండ్‌కు తగ్గట్లు సరఫరా లేకపోవడంతో.. స్థానికంగా నిత్యవసర ధరలు(Commodity prices) మండిపోతున్నాయి. ఈ ఫుడ్ ఎమర్జెన్సీ(Food Emergency) 2025 వరకు కొనసాగుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook