Leopard attack in Madhya Pradesh video goes viral:  కొంత మంది ఫ్యామీలీస్, ఫ్రెండ్స్ తో సరదాగా గడిపేందుకు వీకెండ్ లు లేదా సెలవులు రాగానే కొత్త ప్రాంతాలకు వెళ్తుంటారు. కొంత మంది మాత్రం అడవులు, జూలాజికల్ పార్కులకు కూడా వెళ్తుంటారు. అక్కడున్న జంతువులను చూస్తు చాలా మంది ఎంజాయ్ చేస్తుంటారు.  కానీ కొంత మంది మాత్రం జంతువుల్ని రాళ్లతో కొడుతూ పైశాచికంగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు అడవుల్లోకి వెళ్లి క్రూర జంతువులతో ఫోటోలు దిగేందుకు ప్రయత్నిస్తుంటారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



సెల్ఫీలు తీసుకుంటారు. వీడియోలు రికార్డులు చేస్తుంటారు. ఈ క్రమంలో కొన్నిసార్లు జనాలు జంతువుల దాడులకు గురౌతుంటారు. అవి ఫోటోలు, వీడియోలు చేసిన వాళ్లపై దాడులు చేసిన ఘటనలు కొకొల్లలు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఒక షాకింగ్ ఘటన వైరల్ గా మారింది. మధ్య ప్రదేశ్ లో కొంతమంది యువకులు పిక్నిక్ కు వెళ్లి చిరుతకు చిరాకు తెప్పించారు.ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.


పూర్తి వివరాలు..


మధ్య ప్రదేశ్ లోని షాదోల్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. కొంత  మంది స్నేహితులు షాదొల్ లోని అడవికలోకి పిక్నిక్ కు వెళ్లారు . అది భారీ చెట్లతో దట్టంగా ఉంటుంది.అయితే.. కొండ ప్రాంతంలో చిరుతలు కూడా సంచరిస్తుంటాయి. వీరికి ఒక చిరుత కన్పించింది. వెంటనే దాన్ని ఫోటోలు తీస్తు రెచ్చిపోయారు. అంతే కాకుండా.. రీల్స్ , వీడియోలు తీస్తు హల్ చల్ చేశారు. మొత్తానికి చిరుతకు చిరాకు తెప్పించారు. దీంతో అది ఒక్క ఉదుటున దూకీ వీరిపై దాడికి దిగింది. కింద పడేసి మరీ ముగ్గురిపై చిరుత తన పంజాతో చుక్కలు చూపించింది.


Read more: Viral Video: గడ్డం లేని బాయ్ ఫ్రెండ్స్ కావాలి..?.. రోడ్డెక్కి మరీ కాలేజీ అమ్మాయిల రచ్చ రచ్చ.. వీడియో వైరల్..


అక్కడున్న వారు గట్టిగా కేకలు వేయడంతో వీరి ప్రాణాలు మాత్రం దక్కినట్లు తెలుస్తొంది. కానీ ఆ ముగ్గురు మాత్రం తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తొంది.  చిరుతపులి దాడికి గురైన వారిలో నితిన్ సమ్‌దరియ,  ఆకాష్‌ కుష్వాహా (23), ఖతౌలీ గ్రామానికి చెందిన నందిని సింగ్‌ (25) కూడా ఉన్నారు.వీరిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తొంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిపైన నెటిజన్ లు మాత్రం ఫైర్ అవుతున్నారు.


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.